»   » ఈ రోజు విడుదలవ్వాలి కానీ పది రోజుల ముందే యూట్యూబ్ లో... ఎవరు చేసారా పని ??

ఈ రోజు విడుదలవ్వాలి కానీ పది రోజుల ముందే యూట్యూబ్ లో... ఎవరు చేసారా పని ??

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటి రమ్యశ్రీ వ్యాంప్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తూ కొంత కాలం విరామం తీసుకుని మెగాఫోన్‌ పట్టింది. శ్రీకాకుళం వాసి అయిన ఈమె అక్కడ జరిగిన ఓ సంఘటన ఆధారంగా సినిమా తీశానని స్టేట్‌మెట్‌ ఇచ్చింది. దాదాపు రెండేళ్ళ నుంచి తీస్తున్న ఈ సినిమా విడుదల కోసం అనేక అడ్డంకులు ఎదుర్కొంది. ఆ చిత్రమే 'ఓ మల్లి'.

బి.రమ్యశ్రీ ప్రధాన పాత్రధారిణిగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'ఓ మల్లి'. ఈ చిత్రం ఈనెల 13న నైజాంలో విడుదలవుతుంది. ఇటీవల నైజాం మినహా మిగతా ప్రాంతాల్లో విడుదలైన ఈ చిత్రం ఆడియెన్స్‌ నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా మంచి స్పందనను రాబట్టుకుంది.


Photo Gallery: ఓ మల్లి


గిరిజన ప్రాంతం అరకులో మల్లి తన తండ్రి నారిగాడు తోపాటు జీవిస్తూ ఉంటుంది. కూతురంటే వల్లమాలిన ప్రేమ. అంతకంటే సారాకూ బానిస. ఊరిలోనే సింగడు కన్ను మల్లిపై పడుతుంది. నారిగాడిని మంచి చేసుకుని మల్లిని దక్కించుకోవాలని చూసే క్రమంలో అవమానానికి గురవుతాడు.


'O Malli' releases in Nizam area on May 13

దాంతో కసి పెంచుకుని ఊరి జాతర రోజు రాత్రి మల్లిని అత్యాచారం చేస్తాడు. స్థానికులకు ఇది తెలిసి సింగడుకు గుండుగీసి ఊరేగిస్తారు. ఆ తర్వాత నారిగాడు చనిపోవడంతో ఒంటరిదైన మల్లిని పక్క ఊరి రాములయ్య (రఘుబాబు) పెళ్లి చేసుకుంటాడు. కొద్దికాలానికే రాములయ్య కల్తీసారా తాగి పక్షవాతానికి గురవుతాడు.


అప్పటి నుంచి తనే సేవలు చేస్తూ, గంపలో పిల్లల ఆటవస్తులు అమ్మి జీవనం సాగిస్తుంది. ఇలాంటి సమయంలో విశాఖ రైల్వేస్టేషన్‌లో టికెట్‌ కలెక్టర్‌ రవి ఈమెను చూసి ఇష్టపడతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది? అనేది కథ.


అయితే ఇప్పటికే యూ ట్యూబ్ లో పూర్థి సినిమాని పెట్టేసారు. అయినా థియేటర్లలో రిలీజ్ చేస్తునారు మరి ముందే యూట్యూబ్ లో చూసేసిన వాళ్ళు మళ్ళీ థియేటర్ లో డబ్బులు పెట్టి ఎలా చూస్తారు? మంచి పేరు తెచ్చుకున్న సినిమనే అయినా కలెక్షన్లలో డీలా పడిపోతుంది కదా...


మరి నటి రమ్య శ్రీ ఎందుకిలాంటి నిర్ణయం తెవెసుకుందో అర్థం కావటం లేదు... మొత్తానికి ఒక మంచి సినిమా అనిపించుకున్న ఒక మల్లి కనీస వసూళ్ళని రాబట్టటం లో సఫలం ఔతుందా అనేది ఇప్పుడు ప్రశ్న.. అయితే ఒక అవార్డ్ ఫిలిం కి ఉండాల్సిన అన్ని లక్షణాలూ ఉన్న "ఓ మల్లి" ని పెద్ద తెర మీద కూడా చూడాలనుకునే వారికోసం ఒక అవకాశం అనుకోవచ్చేమో...

English summary
O Malli Latest Telugu Full Movie uploaded in you tube before release in Nijam area
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu