»   »  ‘ఓ స్త్రీ రేపు రా’ రిలీజ్ డేట్ ఖరారైంది

‘ఓ స్త్రీ రేపు రా’ రిలీజ్ డేట్ ఖరారైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రీడింగ్ లాంప్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఆశీష్ గాంధీ, వంశీ కృష్ణ కొండూరి, కునాల్ కౌశిక్, దీక్షా పంత్, శృతి మోల్, మనాలి రాథోడ్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఓ స్త్రీ రేపు రా'. ‘కల్పితమా...కచ్చితమా' అనేది ఉప శీర్షిక. అశోక్ రెడ్డి దర్శక నిర్మాత. ఈ సినిమా డిసెంబర్ మూడో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత అశోక్ రెడ్డి మాట్లాడుతూ...‘ఒకప్పుడు ఊళ్లో దెయ్యం తిరుగుతుందని, ఇండి గోడలపై ఓ స్త్రీ రేపు రా అని రాసుకునే వారు. కొన్నిచోట్లయితే భయంతో చాలా మంది వారు ఉంటున్న గ్రామాలను విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఈ హారర్ థ్రిల్లర్ కాన్సెప్టును సినిమాటిక్ గా, డిఫరెంటుగా ఉండాలని కో ప్రొడ్యూసర్ ప్రవీణ్ సపోర్టుతో ‘ఓ స్త్రీ రేపు రా' చిత్రాన్ని రూపొందించాం. ‘కల్పితమా..కచ్చితమా' ఉప శీర్షిక. టీమంతా చాలా ఇష్టపడి, కష్టపడి చేసిన సినిమా అన్నారు.

O Sthree Repu Raa Movie release date

ఘంటశాల విశ్వనాథ్ సంగీతం అందించిన ఆడియో ఇటీవల విడుదలైంది. పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో రీరికార్డింగ్ హైలెట్ కానుంది. సినిమాను డిసెంబర్ మూడో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారురు దర్శకుడు, నిర్మాత అశోక్ రెడ్డి.

వైవా హర్ష, స్వప్నిక, షాన్, వీరబాబు, శ్యాంసుందర్, సోనాల్ ఘాన్సీ తదితరులు ఇతర తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి మ్యూజిక్: జి.వి ఎడిటర్: రామాంజనేయ రెడ్డి, కెమెరా: సిద్ధం మనోహర్, దేవర హరినాథ్, సాహిత్యం: సుభాష్ నారాయణ్, పవన్ రాచేల్లి, స్క్రిప్ట్, డైలాగ్స్: పవన్ రాచేపల్లి, కో ప్రొడ్యూసర్: ప్రవీణ్ సాగి, కథ-నిర్మాణం-దర్శకత్వం: అశోక్ రెడ్డి.

English summary
O Sthree Repu Raa Telugu Movie releasing in december third week.
Please Wait while comments are loading...