»   » ఓ వాసుమతి సాంగ్: రొమాంటిక్ మూడ్లో భరత్

ఓ వాసుమతి సాంగ్: రొమాంటిక్ మూడ్లో భరత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్‌స్టార్‌ మహేశ్‌, డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంప దానయ్య డి.వి.వి నిర్మిస్తున్న భారీ చిత్రం 'భరత్‌ అనే నేను'. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ హైదరాబాద్‌ ఎల్‌.బి.స్టేడియలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది.

ఏప్రిల్ 20న సినిమా విడుదల ఉండటంతో ప్రమోషన్ల జోరు పెంచారు. తాజాగా ఈ చిత్రంలోని 'ఓ వాసుమతి' లిరికల్ సాంగ్ విడుదల చేశారు. మహేష్ బాబు, కియారా అద్వానీలపై చిత్రీకరించిన రొమాంటిక్ సాంగ్ ఇది. ఇప్పటికే విడుదలైన ఆడయో ఆల్బం సూపర్ హిట్ అయింది.ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తున్నాడు. అయితే సినిమా మొత్తం కేవలం సీరియస్‌గా సాగే రాజకీయాలు మాత్రమే కాకుండా.... మధ్యలో హీరో హీరోయిన్ మధ్య జరిగే రొమాంటిక్ ట్రాక్ కూడా ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతోంది.


పొలిటికల్ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో ఇటు భారీ తారాగణంతో పాటు అటు వందల సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులను ఈ సినిమా కోసం ఉపయోగించారు. ఇటీవల విడుదలైన సినిమా మేకింగ్ వీడియో సినిమాపై అంచనాలు మరింత పెంచింది.


కేవలం ఎంటర్టెన్మెంటు మాత్రమే కాకుండా.... సందేశాత్మక చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు కొరటాల శివ. సమాజం పట్ల, రాజకీయాల పట్ల అటు నాయకుల్లో, ఇటు ప్రజల్లో బాధ్యత పెంచే విధంగా ఈ సినిమా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది.

English summary
O Vasumathi Lyrical Video Song from Bharat Ane Nenu released. The movie starring Mahesh Babu and Kiara Advani. Music by Devi Sri Prasad, Lyrics by Ramajogayya Shastry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X