Just In
- 16 min ago
సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది.. అలా చేయడమే తప్పా: షకీలా సంచలన వ్యాఖ్యలు
- 10 hrs ago
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- 11 hrs ago
క్యూట్ ఫోటోతో ఫిదా చేసేశాడు.. అభిజిత్ చిన్న నాటి ఫోటో వైరల్
- 12 hrs ago
ఓవర్ యాక్షన్ చేయకు!.. శివజ్యోతిపై రవికృష్ణ సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
100 రోజుల ఛాలెంజ్: మహమ్మారి నిర్మూలనకు బిడెన్ చెప్పిన చిట్కా: కొత్త టాస్క్
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బాలీవుడ్ భామతో హార్దిక్ పాండ్య సీక్రెట్ ఎంగేజ్‌మెంట్.. మొత్తానికి ఇలా బయటపడింది
టీమ్ ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య ఆటలతో పాటు వేరే ఇతర విషయాల్లోనూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. ముఖ్యంగా బాలీవుడ్ నటి నటాషాతో డేటింగ్ విషయమై హార్దిక్ ఎన్నోసార్లు హాట్ టాపిక్ అయ్యాడు. అయితే తాజాగా దీనికి ఫుల్‌స్టాప్ పెడుతూ నటాషా స్టాన్కోవిచ్‌తో తాను డేటింగ్ చేస్తున్నానని అంగీకరించాడు హార్దిక్ పాండ్య. సీక్రెట్‌గా నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు తెలిపాడు. ఆ వివరాలు చూద్దామా..

సముద్ర జలాల్లో షికారు.. అఫీషియల్ చేశాడు
సముద్ర జలాల్లో ఓ హ్యాచ్‌లో ప్రయాణిస్తూ పాండ్య తన ప్రియసఖికి ఉంగరం తొడిగాడు హార్దిక్ పాండ్య తన ప్రేయసి నటాషాకు ఉంగరం తొడిగాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ‘హెచ్‌పీ లవ్స్ నాట్స్' అని రాసి పెట్టిన కేక్ కట్ చేశారు. ఈ మేరకు తామిద్దరం నిశ్చితార్ధం చేసుకున్నట్లుగా తెలుపుతూ సోషల్ మీడియాలో సందేశమిచ్చాడు హార్దిక్.

హార్దిక్, నటాషా ఇద్దరూ..
‘మై తేరా, తు మేరీ జాన్, సారా హిందుస్థాన్. 01.01.2020 #ఎంగేజ్‌డ్' అని పేర్కొంటూ హార్దిక్ పాండ్య తన సోషల్ మీడియా సందేశం ఇచ్చాడు. మరోవైపు నటాషా సైతం ఉంగరం ధరించి తన ప్రేమికుడిని ముద్దాడుతున్న వీడియోను పోస్ట్ చేసింది. దీంతో ఈ ఇద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

క్రికెటర్ల స్పందన..
హార్దిక్ పాండ్య నిశ్చితార్థంపై పలువురు క్రికెటర్లు స్పందించారు. విరాట్ కోహ్లీ, కుల్‌దీప్ యాదవ్, ధోనీ సతీమణి సాక్షి, అజయ్ జడేజా, కృనాల్ సతీమణి పంఖూరి శర్మ, సోఫీ చౌదరి, సోనాల్ చౌహాన్, శ్రేయస్ అయ్యర్, ముంబయి ఇండియన్స్, మన్‌దీప్ సింగ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

ఎవరీ నటాషా?
బాలీవుడ్ భామ నటాషా చాలాకాలంగా ముంబయిలోనే ఉంటోంది. 'సత్యాగ్రహ' చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆమె.. బిగ్‌బాస్ (హిందీ 8)లో పాల్గొని క్రేజ్ పెంచుకుంది. బేసికల్ గానే అద్భుతమైన డ్యాన్సర్ అయిన నటాష ప్రస్తుతం వెబ్‌సిరీసులు, టీవీ షోలు, సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
|
టీమిండియాకి దూరంగా.. సర్జరీ చేయించుకుని
వెన్నునొప్పి కారణంగా గత సెప్టెంబరు నెల నుంచి టీమిండియాకి దూరంగా ఉంటున్న హార్దిక్ పాండ్య.. దానికి సర్జరీ చేయించుకుని ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో ఈ జనవరి ఆఖర్లో న్యూజిలాండ్ పర్యటనకి ఈ యువ ఆటగాడిని ఎంపిక చేయాలని భారత సెలక్టర్లు భావిస్తున్నారు. దేశవాళీ క్రికెట్‌లో కనీసం ఒక్క మ్యాచ్ ఆడి ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని ఆయనకు సూచన ఇచ్చారు.