»   » స్పీచ్ ఇస్తూండగానే ....పవన్ ఫ్యాన్స్, బన్ని ఫ్యాన్స్ ఫైట్

స్పీచ్ ఇస్తూండగానే ....పవన్ ఫ్యాన్స్, బన్ని ఫ్యాన్స్ ఫైట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నిన్న రాత్రి జరిగిన నాగేంద్రబాబు కుమార్తె నిహారిక నటించిన 'ఒక మనసు' చిత్రం ఆడియో ఫంక్షన్ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడారు. అల్లు అర్జున్ ఇచ్చిన స్పీచ్ లో తన మనస్సులో మాటలు చెప్పిన సంగతి తెలిసిందే. తాను వేరే హీరోల ఆడియో ఫంక్షన్స్ లో సైతం పదే పదే పవన్ గురించి మాట్లాడమనటం బాగోలేదని, అలాంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ..పట్ల చాలా అన్ కంపర్టబుల్ గా ఉన్నట్లు ఆయన చెప్పారు.

ఫంక్షన్స్ లో అభిమానులు పవన్ కల్యాణ్ పేరు మీద గొడవ చేయొద్దని.. పవన్ కల్యాణ్, తాము ఒకటే కుటుంబం అని అన్నారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్స్ తనను చాలా బాధపెట్టాయని అల్లు అర్జున్ చెప్పారు.


Oka Manasu Audio: Fan Fight During Allu Arjun's Speech

సరిగ్గా ఈ స్పీచ్ జరుగుతన్న సమయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంత మంది...మజిల్ ఫైట్ కు దిగటం అందరినీ విస్మయానికి గురి చేసింది. తాము కూర్చున్న సీట్ల దగ్గరే ఈ ఫైట్ జరిగింది. అల్లు అర్జున్ చెప్పిన మాటకు ఓ పవన్ ఫ్యాన్ సెటైర్ వేయటంతో, తట్టుకోలేని ప్రక్కనే ఉన్న బన్ని ఫ్యాన్ గొడవకు దిగారని, అలా ఈ గొడవ స్టార్టయ్యిందని చెప్పుకుంటున్నారు.


ఇదే స్పీచ్ లో ..చిరంజీవి తర్వాత తనకు పవన్ కల్యాణ్ అంటే ఇష్టం అని సినీ నటుడు అల్లు అర్జున్ అన్నారు. .ఫంక్షన్స్ లో అభిమానులు గొడవ చేయడం వల్ల తాము ఇబ్బందిపడుతున్నాం అని అల్లు అర్జున్ చెప్పారు.


Oka Manasu Audio: Fan Fight During Allu Arjun's Speech

''మీరు ప్రతీసారి పవర్‌స్టార్ అని అరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడకపోవడానికి కారణం పవర్‌స్టార్ కాదు. మీరే. కొంత మంది అభిమానులు పబ్లిక్ ఫంక్షన్ పెట్టినప్పుడు పవర్‌స్టార్ అని అరుస్తూ చాలా ఇబ్బంది పెడుతున్నారు'' అని బన్నీ అన్నారు. ''ఇలాంటి ఫంక్షన్‌కు వచ్చినప్పుడు సినిమాకు సంబంధించినవాళ్ళు పర్సనల్‌గా ఏదో చెప్పుకోవాలనుకుంటారు అని వివరించే ప్రయత్నం చేసారు.

English summary
some fans of Pawan Kalyan and Allu Arjun who got themselves into muscle fights somewhere between seats at the same Oka Manasu audio release event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu