»   » ఒక మనసు... (కొణిదెల నిహారిక-నాగ శౌర్య రొమాంటిక్ ఫోటోస్)

ఒక మనసు... (కొణిదెల నిహారిక-నాగ శౌర్య రొమాంటిక్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగబాబు కూతురు నిహారిక త్వరలో హీరోయిన్ పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు' వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు ఈ చిత్రానికి దర్శకుడు. 'ఒక మనసు' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ శౌర్య హీరో. మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేసారు. ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. త్వరలో ఆడియో విడుదల చేసి సినిమా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

పెళ్లిపై నాగబాబు కూతురు నిర్ణయం సూపర్

వాస్తవానికి ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ పూర్తవ్వాల్సి ఉండగా.... చిరంజీవి కోసం వాయిదా వేసారు. మెగా ఫ్యామిలీకి చెందిన తొలి హీరోయిన్ కాబట్టి చిరంజీవి చేతుల మీదుగా ఆడియో రిలీజ్ చేస్తే బావుంటుందనే ఉద్దేశ్యంతో వెయిట్ చేసారు.

చిరంజీవి డేట్స్ దొరకడంతో ఈ నెల 18 ఆడియో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు నిహారిక అఫీషియల్ గా ఈ విషయాన్ని ఖరారు చేస్తూ తన సోషల్ మీడియా ద్వారా ఆడియో రిలీజ్ పోస్టర్ రిలీజ్ చేసింది.

ఈ చిత్రం హెల్తీ ఎంటర్టెన్మెంట్ సబ్జెక్టుతో ఫీల్ గుడ్ గా ఈ సినిమా ఉంటుందని, మెగా ఫ్యామిలీ ఇమేజ్ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా, నటిగా నిహారికకు మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు. మధుర శ్రీధర్, టీవీ 9 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎక్కువ భాగం షూటింగ్ వైజాగ్ లో జరిగింది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించనున్నారు.

నిహారిక నటన పరంగా ఫర్వాలేదని ఇప్పటికే 'ముద్దపప్పు ఆవకాయ్' అనే వెబ్ సిరీస్ ద్వారా నిరూపించుకుంది. ఇందులో ఆమె కాస్త అల్లరి పిల్లలా కనిపించినా.... ఈ సినిమాలో మాత్రం చాలా డీసెంట్ రోల్ చేస్తోంది. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫోటోలు కూడా రిలీజ్ చేసారు. ఈ ఫోటోలు చూస్తుంటే సినిమాలో నాగ శౌర్య-నిహారిక మధ్య వచ్చే సన్నివేశాలు రొమాంటిక్ గా ఉంటాయని స్పష్టమవుతోంది.

ఆడియో 18న

ఆడియో 18న


ఒక మనసు ఆడియో రిలీజ్ ఈ నెల 18న ప్లాన్ చేసారు. అందుకు సంబంధించిన పోస్టర్ ఇది.

చిరంజీవి చీఫ్ గెస్ట్

చిరంజీవి చీఫ్ గెస్ట్


‘ఒక మనసు' ఆడియో వేడుకకు చిరంజీవి చీఫ్ గెస్టుగా హాజరవుతున్నట్లు సమాచారం.

అల్లరి పిల్ల కాదు

అల్లరి పిల్ల కాదు


నిహారిక ‘ముద్ద పప్పు ఆవకాయ్' సీరియల్ లో అల్లరి పిల్లగా కనిపించింది. అయితే ఇందులో మాత్రం ఆమె రోల్ చాలా డీసెంటుగా ఉండబోతోంది.

జోడీ అదిరింది

జోడీ అదిరింది


నాగ శౌర్య-నిహారిక జోడీ తెరపై సూపర్బ్ గా ఉండబోతోందని అంటున్నారు యూనిట్ సభ్యులు.

అలకలు, బుజ్జగింపులు

అలకలు, బుజ్జగింపులు


సినిమాలో హీరో హీరోయిన్ మధ్య అలకలు, బుజ్జగింపులు లాంటి సన్నివేశాలు రొమాంటిక్ గా ఉండబోతున్నాయి.

నిహారిక

నిహారిక


ఈ చిత్రంలో నిహారిక లుక్ డీసెంటుగా, ఫ్యామిలీ ప్రేక్షకులు మెచ్చేలా ఉండబోతోంది.

సాంప్రదాయాలు

సాంప్రదాయాలు


ఈ చిత్రంలో నిహారిక సాంప్రదాయాలకు విలువనిచ్చే అమ్మాయిగా కనిపించబోతోంది.

లవ్ సీన్స్

లవ్ సీన్స్


నిహారిక, నాగ శౌర్య మధ్య వచ్చే లవ్ సీన్లు యూత్ ను ఆకట్టుకునే విధంగా ఉంటాయి.

ఫ్యామిలీ ప్రేక్షకులు

ఫ్యామిలీ ప్రేక్షకులు


ఫ్యామిలీ ప్రేక్షకులు సైతం అమ్మాయి అంటే ఇలా ఉండాలి అనే విధంగా నిహారిక ఈ సినిమాతో పేరు తెచ్చుకుంటుందని అంటున్నారు.

రొమాంటిక్

రొమాంటిక్


సినిమాలో ఇలాంటి రిమాంటిక్ సీన్లు చాలానే ఉన్నాయట.

మెచ్యూర్డ్ లవ్ స్టోరీ

మెచ్యూర్డ్ లవ్ స్టోరీ


నిహారిక, నాగ శౌర్య మధ్య లవ్ ట్రాక్ చాలా మెచ్యూర్డ్ గా ఉండబోతోంది.

కోపంలోనూ సూపర్

కోపంలోనూ సూపర్


నిహారిక లుక్ కోపంలోనూ సూపర్ గా ఉంటుందనడానికి ఈ ఫోటోయే నిదర్శనం.

సూపర్ జోడీ

సూపర్ జోడీ


నిహారిక-నాగ శౌర్య జోడీ చూసిన వారంతా సూపర్ జోడీ అంటున్నారు.

సక్సెస్ ఖాయం

సక్సెస్ ఖాయం


ఈ చిత్రం మంచి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారంతా.

మెగా అభిమానుల ఆసక్తి

మెగా అభిమానుల ఆసక్తి


మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న తొలి హీరోయిన్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఆసక్తి చూపుతున్నారు.

ఓపెనింగ్స్

ఓపెనింగ్స్


ఈ సినిమా మెగా ఫ్యాన్స్ వల్ల ఓపెనింగ్స్ భారీగానే వస్తాయని అంటున్నారు.

రిలీజ్ భారీగానే

రిలీజ్ భారీగానే


సినిమాకు మంచి డిమాండ్ ఉండటంతో రిలీజ్ భారీగా ప్లాన్ చేసారు.

నిహరిక సూపర్

నిహరిక సూపర్


అంతా నిహారికను చూడటానికి ఈ సినిమాకు వెళతారు అనడంలో సందేహం లేదు.,

త్వరలోనే రిలీజ్

త్వరలోనే రిలీజ్


ఆడియో రిలీజ్ డేట్ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.

English summary
Konidela Niharika debut film 'Oka Manasu' Audio Launch Date Confirmed on 18th May.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu