»   » గర్ల్ ఫ్రెండ్, భార్య మారరు అంటూ వర్మ ట్వీట్

గర్ల్ ఫ్రెండ్, భార్య మారరు అంటూ వర్మ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అందరూ నూతన సంవత్సర వేడుకల్లో మునిగి తేలుతుంటే రామ్ గోపాల్ వర్మ మాత్రం తనదైన రీతిలో ట్విట్టర్ ద్వారా స్పందించారు. కొత్త సంవత్సరంలో అంత ఎగ్జైట్ కావాల్సిన అవసరం ఏమీ లేదు. కేవలం క్యాలెండర్ మాత్రమే కొత్తగా ఉంటుంది. గర్ల్ ఫ్రెండ్, భార్య, జాబ్, పాత సమస్యలన్నీ అలానే ఉంటాయి అంటూ ట్వీట్ చేసారు.


న్యూ ఇయర్ కేవలం డిసెంబర్ 31వ తేదీ రాత్రి 12 గంటలకు మాత్రమే...ఒకసారి నువ్వు ఉదయం నిద్ర లేచాక అన్నీ పాతగానే ఉంటాయి. కొత్తగా హ్యాంగోవర్ అనే సమస్య అప్పటికప్పుడు నీకు కనిపిస్తుంది... అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసారు. ఈ విషయంలో వర్మ వాదనతో చాలా మంది ఏకీభవిస్తున్నారు.
Old Girlfriend and Wife Will Remain Same In New Year: RGV

రామ్ గోపాల్ వర్మ సినిమాల విషయానికిస్తే... ఆయన దర్శకత్వం వహించిన ‘కిల్లింగ్ వీరప్పన్' మూవీ ఈ రోజు విడుదలైంది. కన్నడ, తెలుగు, హిందీలో ఈ చిత్రం తెరకెక్కింది. తెలుగులో రిలీజ్ కావడం లేదని వర్మ నిన్న ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో సినిమా విడుదలైనట్లు తెలుస్తోంది. బుక్ మై షో లాంటి వెబ్ సైట్లలో టికెట్స్ అందుబాటులో ఉండటం గమనార్హం.

రియలిష్టిక్ గా తీసిన ఈ సినిమా స్మగ్లర్‌ వీరప్పన్‌ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. శివరాజ్‌కుమార్‌, సందీప్‌ భరద్వాజ్‌, యజ్ఞాశెట్టి, సంచారి విజయ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అండర్‌ వరల్డ్‌ డాన్‌, మాఫియా డాన్‌ల కంటే కూడా వీరప్పన్‌ ఎంతో శక్తివంతుడు అని, ఆయన తిరుగులేని క్రిమినల్‌ అంటూ వీరప్పన్‌ గురించి వర్మ చెబుతు మరీ తెరకెక్కించారు.

రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కొన్నేళ్ళ పాటు వణికించిన డేంజరస్ క్రిమినల్ వీరప్పన్‌ను చంపిన ఓ పోలీసాఫీసర్ కథగా ‘కిల్లింగ్ వీరప్పన్' రూపొందింది. కర్ణాటక, తమిళనాడు, మారెడుమిల్లి ఫారెస్ట్ ఏరియాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. వర్మ మాట్లాడుతూ... వీరప్పన్ గురించి తెలుసుకున్న తర్వాత అతడు ఎంత డేంజరస్ వ్యక్తి అనే విషయం అర్థమైందని, అలాంటి క్రిమినల్‌ను చంపిన ఓ పోలీసాఫీసర్ కథే ఈ ‘కిల్లింగ్ వీరప్పన్' అని వర్మ తెలిపారు. వీరప్పన్ గురించి తెలుసుకున్న తర్వాత మాఫియా గ్యాంగ్‌స్టర్ మర్డర్స్ లాంటివి చిన్న పిల్లల ఆటలా కనిపించాయని వర్మ తెలిపాడు.

English summary
"New year is only at 12 in night and once u wake up in morning the same old problems will remain with the additional problem of hangover. It's only the year which becomes New..but the wife,the girlfriend,the job,the problems will all remain as old as they were" Ram Gopal Varma tweeted.
Please Wait while comments are loading...