»   » కమల్ నుంచి కరణ్ జోహార్ దాకా..క్రికెటర్స్ నుంచి హీరోయిన్స్ దాకా అంతా ట్వీట్స్

కమల్ నుంచి కరణ్ జోహార్ దాకా..క్రికెటర్స్ నుంచి హీరోయిన్స్ దాకా అంతా ట్వీట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు, పద్మ శ్రీ అవార్డు గ్రహీత ఓం పురి (66) ఈ రోజు ఉదయం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన హఠాన్మరణంతో సినీ ప్రపంచం ఒక్కసారిగా మూగబోయింది. విలక్షణమైన పాత్రలల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న తమ సహనటుడు ఇక లేరన్న వార్తతో యావత్తు సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయింది.

ఓం పురి అకాల మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వసుంధర రాజే సహా ఇతర రాజకీయ ప్రముఖులు, పలువురు సీనియర్ నటీ నటులు, దర్శకులు, క్రీడాకారులు, ఇతర ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

భారతీయ సినిమాలతో పాటు పాకిస్తానీ తదితర విదేశీ సినిమాల్లో నటించిన ఆయన విలక్షణ ప్రాతలతో సినీ విమర్శకుల ప్రశంసలతో బలు అవార్డులను కూడా అందుకున్నారు. హర్యానాలోని అంబాలో 18 అక్టోబర్ 1950 లో పుట్టిన ఆయన పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. మరో సీనియర్ నటుడు, దివంగత అమ్రేష్ పురి, ఓంపురి సోదరుడు.

మోదీ సంతాపం

ఓంపురి మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. నాటకాలు, సినిమాల్లో ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు.

మిస్ అవుతున్నాం


ఓమ్ ..మేము నిన్ను మిస్సవుతున్నాం అంటూ సీనియర్ నటుడు రిషి కపూర్ ట్వీట్ చేసారు.

మమ్మల్ని వదిలేసి

ఓం పురి...మమ్మల్ని వదిలేసి తొందరగా వెళ్లిపోయారు. మేము వెరీ సారి. ఫన్, నవ్వులు. ఆర్గుమెంట్స్ ఇంకా కళ్లముందే ఉన్నాయి. మేము నిన్ను మిస్ అవుతున్నాం అంటూ షబానా ఆజ్మి ట్వీట్ చేసారు.

నమ్మలేకపోతున్నా


బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఓంపురి మరణంపై ట్విట్టర్ ద్వారా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బెడ్ మీద ఆయన అలా ప్రశాంతంగా నిశ్చలంగా పడి వుండటాన్ని నమ్మలేకపోతున్నానంటూ సంతాపం వ్యక్తం చేశారు.

మిస్ అవుతున్నాం

ఓంపురి నీకు నివాళి. మాలో అద్బుతమైన వాడిని కోల్పోయాం. టాలెంట్, వాయిస్, స్పిరిట్..అన్ని మిస్ అవుతున్నాం పూరి సాబ్ అంటూ బొమన్ ఇరాని ట్వీట్ చేసారు.

కరణ్ జోహార్

సాలిడ్ యాక్టర్, సాలిడ్ ఫిల్మోగ్రఫి, టాలెంట్ ఇన్ని ఉన్న బ్రిలియంట్ నటుడుని కోల్పోయాం అంటూ నటుడు, దర్శకుడు, నిర్మాత కరుణ్ జోహార్ ట్వీట్ చేసారు.అద్భుతమైన నటుడ్ని కోల్పోయామొంటూ కరణ్ జోహార్ ట్విట్ చేశారు.

తొలి నటుడు

అంతర్జాతీయ సినిమాలకు పనిచేసిన తొలినటుడు అంటూ గుర్తుచేసుకున్న ప్రముఖ నటి, నిర్మాత వివేక్ అగ్నిహోత్రి సంతాపం ప్రకటించారు.

నివాళి

ఇంకా క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ సంతాపం తెలిపిన వారిలోఉన్నారు. ఆయనేం ట్వీట్ చేసారో క్రింద చూడండి.

కోల్పోయాం


మేం ఓ తెలివైన, టాలెంటెడ్ నటుడుని కోల్పోయాం. ఇది సినిమా పరిశ్రమకే కాక మన దేశానికే పెద్ద లాస్, ఆయన ఆత్మ శాంతించాలి అంటూ నసీరుద్దన్ షా ట్వీట్ చేసారు.

మిస్ అయ్యాం

మేము నిన్ను మిస్ అయ్యామంటూ ప్రముఖ బాలీవుడ్ దర్సకుడు మధూర్ బండార్కర్ ట్వీట్ చేసి నివాళి తెలియచేసారు

గర్వపడుతున్నాం

మీతో ఇంటరాక్ట్ క్షణాలు ఇంకా గుర్తున్నాయి. మీరు మేమంతా గర్వపడే ఆర్టిస్ట్ అంటూ దర్శకుడు సుజిత్ సర్కార్ ట్వీట్ చేసారు.

అందమైన తోటలో


భగవంతుడు తోట చాలా అందమైనది. ఆయన బెస్ట్ అనుకున్నవి తీసుకుంటారు. బెర్లిన్ లో బ్రాంది షేర్ చేసుకుంటూ ...నవ్వుకున్న నవ్వులను మర్చిపోలేం అంటూ షారూఖ్ ఖాన్ ట్వీట్ చేసారు.

ఇన్సప్రేషన్


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఈ విషయమై ట్వీట్ చేస్తూ టాలెంటెతో కూడిన వెర్శటైల్ నటుడు ఆయన. ఎన్నో నిజ జీవితపాత్రలను తెరపైకి తెచ్చారు. ఆర్టిస్ట్ లకు ఆయనో ఇన్సిప్రేషన్ అని సంతాపం వ్యక్తం చేసారామె.

చాలా బాధగా ఉంది


ఓం పురి సాబ్ నాకు మంచి స్నేహితుడు, గొప్ప నటుడు ఆయన లేరని ఊహించుకోవటమే బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా అన్నారు.

నిజంగానే ముగిసింది


మీరు ఇండియన్ సినిమా లో లో భాగం. ఓ యుగం నిజంగానే ముగిసింది. మీకు నా నివాళి అంటూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ట్వీట్ చేసారు.

కొనసాగుతుంది


మీతో మాట్లాడిన అద్బుతమైన మాటలని మేము ఎప్పటికీ మర్చిపోలేం. మీ లెగసీ కొనసాగుతుంది. మీకు ఇదే నా నివాళి

షాకయ్యా

మీరు లేరనే వార్త నిజంగానే షాక్ కు గురి చేసింది. నా ముఖ్యమైన స్నేహితుడు, కొలిగ్ అయిన మిమ్మల్ని మర్చిపోవటం కష్టం.

కొద్ది కాలం క్రితం..


కొద్దినెలల క్రితమే ఓంపురి సాబ్ ని కలిసాను. చాలా అద్బుతంగా మాట్లాడతారు ఆయన. ఆయన హఠాత్తు మరణం ఊహించలేనిది అంటూ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ అన్నారు.

ఎరా ముగిసి,లెగసి

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ...ప్రియాంక చోప్రా...ట్వీట్ చేస్తూ...ఒ యుగం ముగిసింది..లెగసి కంటిన్యూ అవుతుంది..నివాళి అన్నారు

ఇద్దరం కలిసి

వినటానికి చాలా విచారంగా ఉంది. నేను ఓంపురి చాలా సినిమాల్లో కలిసి నటించాం. హృదయపూర్వక సంతాపం అంటూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేసారు.

వర్క్ నిలిచే..

నేను మీ స్నేహితుడుని అయ్యినందుకు గర్విస్తున్నా, నేను మీ నట ఆరాధుకుడుని, ఎవరు ఓంపురి లేరని చెప్పే ధైర్యం చేసింది,ఆయన చేసిన వర్క్ నిలిచే ఉంటుంది అని కమల్ అన్నారు.

బ్రిలియంట్...

బాలీవుడ్ కమిడియన్, క్యారక్టర్ ఆర్టిస్ట్ రాజ్ పాల్ యాదవ్ మాట్లాడుతూ...మనం ఓ బ్రిలియెంట్ నటుడుని కోల్పోయాం. షాకింగ్ గా ఉంది ఈ వార్త అంటూ ట్వీట్ చేసారు

సానుభూతి

బాలీవుడ్ హీరో, నిర్మాత రితీష్ దేశముఖ్ ట్వీట్ చేస్తూ... మేము లేరనే వార్త జీర్ణించుకోలేకపోతున్నాం. మీ కుటుంబానికి ఇదే నా సానుభూతి అన్నారు

మిస్ అయ్యాం...

మేము మిమ్మల్ని మిస్..అయ్యా..మిస్ అయ్యాం..మిస్ అయ్యాం అంటూ సన్నిడియోల్ ట్వీట్ చేసారు.

English summary
Fans mourned acting giant Om Puri’s death on social media as the end of an era. The 66-year-old actor died of a heart attack at his home in Mumbai this morning.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu