»   » పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్ ఢీ అంటే ఢీ....

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్ ఢీ అంటే ఢీ....

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్‌ కళ్యాణ్‌ టైటిల్‌ పాత్ర పోషించిన 'కొమరం పులి", మహేష్‌ బాబు నటించిన 'మహేష్ ఖలేజా", ఎన్టీఆర్‌ తో తెరకెక్కిన'బృందావనం".. మూడు చిత్రాలు నెల రోజుల వ్యవధిలో విడుదల కావడం తెలిసిందే. మళ్లీ వేసవికి కూడా ఈ ముగ్గురు టాప్‌ హీరోల చిత్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడే అవకాశముందనే అంచనాలు వెలువడుతున్నాయి.

జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ తో 'లవ్‌ ఆజ్‌ కల్‌"కు రీమేక్‌ గా నటుడు గణేష్‌ బాబు నిర్మిస్తున్న చిత్రం వేసవి కానుకగా విడుదలయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఈ చిత్రానికి అధికారికంగా టైటిల్‌ ఇంకా ప్రకటించకపోయినా..'వల్లీ"'తీన్ మార్" అనే రెండు టైటిల్స్‌ ప్రచారంలో ఉన్నాయి. అలాగే, మహేష్‌ బాబు-శ్రీనువైట్ల కాంబినేషన్‌ లో రూపొందుతున్న 'దూకుడు" చిత్రాన్ని కూడా సమ్మర్‌ స్పెషల్‌ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన 'ఖలేజా" కూడా నిరాశపరిచినందున మహేష్‌ ఫ్యాన్స్‌ 'దూకుడు" చిత్రం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇక, ఈ ఏడాది సంక్రాంతికే విడుదలవుతుందని ప్రకటించబడిన ఎన్టీఆర్‌ 'శక్తి" కూడా వేసవి వినోదం అందించేందుకు బరిలోకి దిగనుంది. తెలుగు చలన చిత్ర చరిత్రలోనే అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌ లో విడుదల చేయడమే సరైనదని దర్శకనిర్మాతలతోపాటు చిత్ర కథానాయకుడు ఎన్టీఆర్‌ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు మొనగాళ్లు మరొకసారి 'ఢీ అంటే ఢీ" అనబోతున్నారా అనే ఆసక్తికర చర్చ టాలీవుడ్‌ లో మొదలు కానుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu