twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాలకు శాపంగా, దడ పుట్టిస్తున్న ట్విట్టర్.. ఆ విషయంలో ఫెయిల్!

    |

    ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం ఎక్కువైన తరువాత సినిమాలపై రెండు రకాలుగా ప్రభావం చూపిస్తున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే ఎంత స్పీడ్ గా వైరల్ అవుతుందో నెగిటివ్ టాక్ వస్తే కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో వైరల్ అవుతోంది. పాజిటీవ్ కంటే నెగిటివ్ గానే ప్రభావం పడుతోంది. అందుకే కొందరు సెలబ్రిటీలు ట్విట్టర్ లోకి రావడానికి కూడా భయపడుతున్నారు. కొత్త సినిమాలు విడుదలైతే చాలు ఫ్యాన్స్ హడావుడి చేసే విధానం ఉహాలకందని విధంగా ఉంటుంది.

    ఇక ట్విట్టర్ లో అయితే మొదటి రోజే సినిమాలోని సీన్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా పైరసీ చేసి మరీ కొంతమంది ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు సోషల్ మీడియానే సినిమాలకు మరింత వణుకు పుట్టిస్తోంది. ఇక రీసెంట్ గా ఒక హాలీవుడ్ మూవీకి సంబంధించిన సీన్స్ ఒక యూజర్ పోస్ట్ చేయడం వైరల్ అయ్యింది. ట్విట్టర్ మాత్రం అలాంటి వీడియోలపై వెంటనే రియాక్ట్ కావడం లేదు. ఎవరైనా సరే సినిమాల వీడియోలను అప్ లోడ్ చేస్తే రూల్ ప్రకారం కాపీరైట్ స్ట్రైక్ సిస్టమ్ అలెర్ట్ అయ్యి దాన్ని డిలీట్ చేయాల్సి ఉంటుంది.

    Once again Twitter failed in copyright strike system and users upload films

    కానీ ట్విట్టర్ కాపీరైట్ స్ట్రైక్ సిస్టమ్ విఫలమైనట్లు తెలుస్తోంది. ట్విట్టర్ ను ఎలాన్ మాస్క్ కొనుగోలు చేసిన తరువాత చాలా వరకు ఉద్యోగులు అతని ఒత్తిడికి భరించలేక జాబ్ మానేసి వెళ్లిపోతున్నారు. ఇక పలు కార్యాలయాలు కూడా మూత పడుతున్నాయి. ఎలాన్ మాస్క్ అనవసరమైన నిర్ణయాలతో ట్విట్టర్ ను మూత పడేలా చేస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ ట్విట్టర్ రిప్ అనే ట్యాగ్ కూడా వైరల్ అయ్యింది. ఇక త్వరలోనే మాస్క్ ట్విట్టర్ లో 40 నిమిషాల వరకు వీడియో అప్ లోడ్ చేసుకునే విధంగా మార్పులు చేయబోతున్నట్లు టాక్ వచ్చింది. ఇక అలా జరిగితే మాత్రం సినిమాలకు మరింత ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పవచ్చు.

    English summary
    Once again Twitter failed in copyright strike system and users upload films
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X