కాబోయో భర్తతో రేణు దేశాయ్.. అకీరా తీసిన ఫోటో.. మళ్ళీ అదే తంతు!

Recommended Video

Renu Desai Photo Goes Viral In Social Media

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో వివాహానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నుంచి ఆమె విడాకులు పొంది ఏడేళ్లు గడిచిపోతోంది. ఇన్నేళ్ళపాటు ఆమె పుణేలో తన పిల్లలతో గడిపింది. ఇటీవలే తాను రెండో వివాహం చేసుకోవాలని రేణు దేశాయ్ నిర్ణయించుకోవడం, ఎంగేజ్ మెంట్ చకచకా జరిగిపోయాయి. త్వరలో వివాహం జరగబోతోంది. కానీ ఇంత వరకు వరుడు ఎవరనే సంగతి బయట ప్రపంచానికి తెలియదు. తనకు కాబోయే భర్త వివరాలని రేణు ఇంకా గోప్యంగానే ఉంచుతోంది.

అమెరికాలో కాబోయే భర్తతో

అమెరికాలో కాబోయే భర్తతో

రేణు దేశాయ్ ప్రస్తుతం తన పిల్లలు, కాబోయే భర్తతో అమెరికాలో విహరిస్తునట్లు తెలుస్తోంది. వివాహానికి ముందు వీరంతా టూర్ వెళ్లారు. రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాక.. పవన్ తో విడాకుల విషయంపై కూడా రేణు పెదవి విప్పింది.

కోరుకున్నది ఆయనే

కోరుకున్నది ఆయనే

పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు నేను కోరుకోలేదని రేణు క్లారిటీ ఇచ్చింది. తాను ఉండగానే మరో మహిళతో బిడ్డకు జన్మనిచ్చిన విషయంలో వివాదం విడాకులకు దారి తీసిందని రేణు ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపింది.

 ట్రోలింగ్ వలెనే

ట్రోలింగ్ వలెనే

రేణు రెండవ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటి నుంచి ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఈ కారణంగానే రేణు దేశాయ్ తన కాబోయే భర్త వివరాలు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఎంగేజ్ మెంట్ జరిగాక మాత్రం ముఖం చూపించకుండా అతడి ఫోటోని పోస్ట్ చేసింది.

 మళ్ళీ అదే తంతు

మళ్ళీ అదే తంతు

మరోమారు రేణు దేశాయ్ నెటిజన్లని ఊరించింది. కాబోయే భర్తతో రొమాంటిక్ ఫోజులో ఉన్న ఫోటోని రేణు దేశాయ్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ సారి కూడా అతడి ముఖాన్ని చూపించలేదు.

అకీరానే స్వయంగా

ఈ ఫోటోని స్వయంగా అకీరానే క్లిక్ మనిపించినట్లు రేణు దేశాయ్ పేర్కొంది. తన పిల్లల అంగీకారంతోనే తాను రెండవ వివాహం చేస్తున్నటున్నట్లు క్లారిటీ ఇచ్చింది. రేణు కాబోయే భర్త భుజం మాత్రమే ఈ ఫొటోలో కనిపిస్తుండడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X