»   » గుండె ఆగినంత పనైంది.. కింద పడిపోవడం ఖాయం.. ప్రభాస్

గుండె ఆగినంత పనైంది.. కింద పడిపోవడం ఖాయం.. ప్రభాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి చిత్రం విడుదలైన తర్వాత అందర్ని వెంటాడుతున్నది ఒకటే ప్రశ్న. అది బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ చిత్ర తర్వాత అందరూ తనను అదే ప్రశ్నను అడుగుతున్నారని డార్లింగ్ ప్రభాస్ తెలిపారు. ఇలానే పదే పదే ఆ ప్రశ్నను అడిగిన ఓ వ్యక్తికి బాహుబలి-3 వరకు ఆగాల్సిందేనని చెప్పగా అతడి గుండె ఆగినంత పనైంది అని ఆయన వెల్లడించారు. ఆయన కంగారును చూసి బహుబలి2లో తెలిసిపోతుందని చెప్పానన్నారు. ఇటీవల ఓ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.

రానాతో ఫైట్ ప్రత్యేక ఆకర్షణ

రానాతో ఫైట్ ప్రత్యేక ఆకర్షణ

బాహుబలి-2లో చిత్రంలో ఉన్న ప్రధాన ఆకర్షణల్లో రానాతో తన ఫైటింగ్ ఒకటి అని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పాడు. ‘వివాహం ఎప్పుడన్నది నా చేతుల్లో లేదు. దానికి కరెక్ట్ సమాధానం నా వద్ద దొరకదు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలను మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తాను‘ అని బాహుబలి తెలిపారు.


బాహుబలి చిత్రంతో ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి..

బాహుబలి చిత్రంతో ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి..

బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరుకొన్నది. దర్శకుడు రాజమౌళి, ప్రభాస్, రానాల పేర్లు దేశవ్యాప్తంగా మోరుమోగాయి. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోకి ప్రభాస్ మైనపు బొమ్మ పెట్టేందుకు బాహుబలి విజయం తోడ్పడింది.


కథ విన్నప్పుడే అనిపించింది... రిలీజ్ తర్వాత నిజమైంది

కథ విన్నప్పుడే అనిపించింది... రిలీజ్ తర్వాత నిజమైంది

రాజమౌళి బాహుబలి కథ వినిపించినప్పుడే అంతర్జాతీయ చిత్రం అవుతుందనుకున్నా. సినిమా రిలీజ్ తర్వాత నేను అనుకున్నది నిజమైంది. ఐదున్నరేళ్ల క్రితం నాకు ఆయన ఈ కథ చెప్పారు. అప్పటి నుంచి బాహుబలితో నా ప్రయాణం మొదలైంది.


బాహుబలి తర్వాత గుర్తు పట్టేస్తున్నారు..

బాహుబలి తర్వాత గుర్తు పట్టేస్తున్నారు..

బాహుబలి తర్వాత ముంబై, ఢిల్లీకి వెళితే అందరూ నన్ను గుర్తుపట్టేస్తున్నారు. నాతో ఫొటోలు దిగేందుకు ఆరాటపడుతున్నారు. అదంతా కూడా బాహుబలి వల్లే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో.


సాధారణ స్థితికి రాలేకపోయా

సాధారణ స్థితికి రాలేకపోయా

టుస్సాడ్స్ మ్యూజియంలో నా మైనపు బొమ్మను పెట్టాలనుకుంటున్నారన్న ప్రతిపాదనను నా మిత్రుడు చెప్పగా నమ్మలేకపోయాను. వెంటనే రాజమౌళి, వాళ్లబ్బాయి కార్తికేయ, వల్లి గారికి ఫోన్ చేశాను. వారు చాలా ఆనందపడ్డారు. దాదాపు ఒక్క రోజు దాకా నేను సాధారణ పరిస్థితికి రాలేకపోయాను.


బాహుబలి సక్సెస్‌ను తలకెక్కించుకోను

బాహుబలి సక్సెస్‌ను తలకెక్కించుకోను

బాహుబలి సినిమా విజయంతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ సక్సెస్‌ను నెత్తికెక్కించుకున్నామంటే వెంటనే కిందికి పడిపోవడం ఖాయం. అందుకే విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నానంతే. ఇక, హిందీ సినిమాల గురించి ఇప్పడేమీ అనుకోలేదు. నాకు చాలా ఆలోచనలున్నాయి. రెండు నెలల తర్వాత ఏంటనేది చెప్తాను' అని వెల్లడించాడు.


English summary
Prabhas following double after Bahubali Hit. This movie after his craze taken to international level. Now he is getting ready with Bahubali2.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu