»   » దేవుడా ఇలా అయిందేంటి? మార్నింగ్ షోకు ముందే ప్లాప్ టాక్, షాకింగ్ రివ్యూస్

దేవుడా ఇలా అయిందేంటి? మార్నింగ్ షోకు ముందే ప్లాప్ టాక్, షాకింగ్ రివ్యూస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రతి ఈద్ సీజన్లో తన సినిమా రిలీజ్ చేస్తుంటాడు. తాజాగా ఆయన నటించిన 'ట్యూబ్ లైట్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు గ్రాండ్‌గా రిలీజైంది. సల్మాన్ ఖాన్‌కు ఇంతకు ముందు ఏక్ థా టైగర్, బజరంగీ భాయిజాన్ లాంటి సూపర్ హిట్లను అందించిన కబీర్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బేనర్లో స్వయంగా సల్మాన్ ఖానే నిర్మించడం మరో విశేషం. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.

1962 ఇండియా-చైనా వార్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కింది. అయితే సినిమా మార్నింగ్ షో పడక ముందే నెగెటివ్ రిపోర్ట్ వచ్చేసింది.

డిసప్పాయింటింగ్

డిసప్పాయింటింగ్

ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ రోజు ఉదయం 9 గంటలకే సినిమా రిపోర్ట్ ఏమిటో బయట పెట్టాడు. వన్ వర్డ్ లో రివ్యూ రాశారు. సినిమా పూర్తిగా డిసప్పాయింటింగ్ గా ఉందని తేల్చేశారు. సల్మాన్ ఖాన్ లాంటి సాలిడ్ స్టార్ పవర్, స్టన్నింగ్ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలో ఉన్నాయని... అయితే ట్యూబ్ లైట్ బాడీ ఎంతో అందంగా ఉన్నా సోల్(ఆత్మ) మిస్సయింది అంటూ చెప్పారు.

దేవుడా ఇలా అయిందేంటి?

దేవుడా ఇలా అయిందేంటి?

సల్మాన్ ఖాన్ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే సినిమా మార్నింగ్ షోకే ఇలాంటి నెగెటివ్ రిపోర్టులు సొంతం చేసుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సల్మాన్ ఖాన్ అభిమానులు తట్టుకోలేక పోతున్నారు.

ట్విట్టర్లో ట్వీట్ల వర్షం

ట్విట్టర్లో ట్వీట్ల వర్షం

అయితే కొందరు సల్మాన్ ఖాన్ అభిమానులు మాత్రం ట్విట్టర్లో సినిమా అద్భుతంగా ఉందంటూ సినిమాను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా సినిమా నిలబడే అవకాశం మాత్రం కనిపించడం లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

సందేశాత్మకంగా...

సందేశాత్మకంగా...

ఇండియా-చైనా వార్ బ్యాక్ డ్రాప్‌తో సినిమాను ప్లాన్ చేసి ఇందులో ఓ బ్యూటిఫుల్ సందేశాన్ని పొందుపరిచారు. అయితే సినిమా కథలో లోపం ఉండటం వల్లనే బాక్సాఫీసు వద్ద ఇలా ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుందని అంటున్నారు.

హాలీవుడ్ మూవీ ఆదర్శం

హాలీవుడ్ మూవీ ఆదర్శం

హాలీవుడ్లో 2015లో వచ్చిన ‘లిటిల్ బాయ్' అనే ఓ హాలీవుడ్ మూవీ ఇన్స్‌స్పిరేషన్‌తో ‘ట్యూబ్ లైట్' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ క్యారెక్టరైజేషన్ కూడా కాస్త భిన్నంగా ఉంది.

అదే మైనస్ అయిందా?

అదే మైనస్ అయిందా?

సినిమాలో సల్మాన్ ఖాన్ క్యారెక్టరైజేషన్ కాస్త భిన్నంగా ఉందని.... ఇప్పటి వరకు మాస్ క్యారెక్టర్లో అలరించిన సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ఇలా కనిపించడం చాలా మందికి నచ్చలేదేమో అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

English summary
"OneWordReview...#Tubelight: Disappointing. Solid star power [Salman Khan]. Stunning visuals. But #Tubelight is body beautiful, minus soul." Taran Adarsh‏ tweetwed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu