For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ టాపిక్:కేవలం మంచు లక్ష్మి మాత్రమే చేయగలదు

  By Srikanya
  |

  హైదరాబాద్ : నిర్మాతగా, నటిగా ముందుకు వెళ్తున్న మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ప్రసన్న ఇవాళ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. బాలకృష్ణ అతిధిపాత్రలో రూపొందిన చిత్రం 'ఊకొడతారా..ఉలిక్కి పడతారా' చిత్రాన్ని ధైర్యంగా అంత బడ్జెట్ తో నిర్మించినందుకు కాకుండా ఆమె ఆ సినిమాలో చేసిన పాత్ర గురించి మాట్లాడుకుంటున్నారు. మంచు మనోజ్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో సినిమా అంతా ఒక ఎత్తు ఆమె నటించిన పాత్ర ఒక ఎత్తు అన్నట్లు సాగటం చర్చనీయాంసంగా మారింది.

  కథలో కీలకమలుపుని తెచ్చే మంచు లక్ష్మి పాత్ర గెటప్ సినిమా చూసిన వారిని ఉలిక్కిపడేలా చేసింది. ముఖ్యంగా ఆమె క్లైమాక్స్ లో చేసిన నటన అధ్బుతం అంటున్నారు. సోనూసూద్ పాత్ర ఆమెలో ప్రవేశించి చేసే అలజడి క్లైమాక్స్ కు ఊపు తీసుకు వచ్చింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఆమె పాత్రకు మాత్రం శభాష్ అంటున్నారు. నిర్మాతగా కన్నా ఆమె నటిగా మంచి మార్కులు వేయించుకుంది. బలహీనమైన కథలో కూడా ఆమె బలమైన పాత్రతో నిలబెట్టేందుకు ప్రయత్నం చేసింది. రాబోయే గుండెల్లో గోదారి చిత్రంలో కూడా ఆమె నటన హైలెట్ అవుతుందని అంటున్నారు.

  బ్లాక్ కామెడీగా చెప్పబడుతున్న ఈ చిత్రం పై గత రెండు సంవత్సరాలుగా మంచులక్ష్మి వర్క్ చేస్తున్నారు. ప్లాఫ్ ల్లో ఉన్న తన సోదరుడు మంచు మనోజ్ కెరీర్ కి ఈ చిత్రం హిట్ ఇచ్చి నిలబెడుతుందని భావిస్తున్నారామె. కథలోకి వస్తే...గంధర్వమహల్‌కు అధిపతి నరసింహరాయుడు (బాలకృష్ణ). గంధర్వ మహల్‌ను సొంతం చేసుకోవాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో మహల్‌లోకి ఓ యువకుడు (మంచు మనోజ్‌) ప్రవేశిస్తాడు. నరసింహరాయుడు కుటుంబానికి ఆ యువకుడికి ఉన్న సంబంధం కథలో కీలకం. నరసింహరాయుడు మహల్‌ను రక్షించే క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది మిగిలిన కథ.

  చిత్ర నిర్మాత మాట్లాడుతూ ''ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే ప్రధాన బలం. ప్రతి సన్నివేశం ఉత్కంఠను రేకెత్తిస్తుంది. బాలకృష్ణ, మనోజ్‌ల నటన ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. వారు తమ పాత్రలకు ప్రాణం పోశారు. గంధర్వమహల్‌ సెట్‌ని రూ.6 కోట్ల వ్యయంతో తీర్చిదిద్దాం. విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రత్యేక ఆకర్షణ'' అన్నారు. ఇక 'ఊకొడతారా..ఉలిక్కి పడతారా' రిలీజై డివైడ్ టాక్ తెచ్చుకుంది. మంచు ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై పద్మశ్రీ డా.ఎం. మోహన్ బాబు సమర్పణలో మంచు మనోజ్, దీక్షాసేత్ హీరో హీరోయిన్లుగా శేఖర్ రాజా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. దర్శకుడు శేఖర్ రాజా చెప్పిన పాత్రలోని ఉదాత్తతకు ఆకర్షితులై 'ఊ కొడతారా..ఉలిక్కిపడతారా'లో నటించడానికి నందమూరి బాలకృష్ణ అంగీకరించారని నిర్మాతలు చెప్పారు.

  English summary
  Lakshmi Manchu’s stunning performance in Uu Kodathara Ulikki Padathara climax is getting rave reviews. She has Gundello Godari movie lined up for release in which she played the lead role. With Manchu Lakshmi’s success as an actress we could see more star daughters to shine on Telugu screen for sure.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X