'ఊసరవెల్లి' హిందీ వెర్షన్ వివరాలు

By Srikanya

ఎన్టీఆర్ తాజా చిత్రం ఊసరవెల్లి హిందీ డబ్బింగ్ రైట్స్ ని ఆదిత్యా మ్యూజిక్ కంపెనీ వారు తీసుకున్నట్లు సమాచారం.వారు వీటిని నలభై లక్షలకు సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ సర్కిల్సో వినపడుతోంది. అయితే మరో ప్రక్క ఈ చిత్రం హిందీలోకి రీమేక్ చేస్తారని,రణబీర్ కపూర్ హీరోగా చేస్తాడని వార్తలు వినపడుతున్నాయి. ఇక ఇప్పటివరకూ ఈ చిత్రం 56 కోట్లు కలెక్టు చేసినట్లు 36 కోట్లు షేర్ వచ్చినట్లు నిర్మాత బివివియస్ ఎన్ ప్రసాద్ చెప్తున్నారు. దసరా రోజున విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా మాత్రం స్టడీగా ఉంది. ఎన్టీఆర్ కి భాక్సాఫీస్ వద్ద ఉన్న స్టామినా ఏమిటనేది ఊసరవెల్లి పూర్తిగా చెప్పిందని ట్రేడ్ విశ్లేషకలు అంచనా వేస్తున్నారు. వారు లెక్కలు ప్రకారం...57 కోట్లు ఇప్పటివరకూ వసూలు చేసింది.

ఎన్టీఆర్, తమన్నా జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఊసరవెల్లి దసరా రోజున విడుదలైంది. సురేంద్రరెడ్డి ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ఈ చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ, సెంటిమెంట్, యూత్‌కి కావల్సిన అంశాలు ఉండటంవల్ల ఫుల్ మీల్ మూవీగా ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఎన్టీఆర్ కెరీర్‌లోనే మొదటి వారం ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రం ఇది అన్నారు. ఎన్టీఆర్ హీరోయిజమ్‌కి భిన్నంగా ఈ చిత్రం ఉందనే టాక్ ప్రచారంలో ఉందనే ప్రశ్న సురేందర్‌రెడ్డి ముందుంచగా అలా ఏం లేదు. ఈ చిత్రంలో తమన్నా తనకు ఓ వెలుగు చూపమని ఆంజనేయస్వామిని ప్రార్థించినప్పుడు ఆ వెలుగు ఎన్టీఆర్ అని చూపించాం అని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X