»   » కీరవాణి వెరైటీగా చేసాడు.... మరి రాజమౌళి ఊరుకుంటాడా!

కీరవాణి వెరైటీగా చేసాడు.... మరి రాజమౌళి ఊరుకుంటాడా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి డైరెక్టర్ రాజమౌళికి తనకు నచ్చిన విషయాలన్నీ సోషల్ మీడియా ద్వారా మీడియాతో పంచుకోవడం అలవాటు. అవి సినిమాలకు సంబంధించిన విషయాలైనా, ఇతర విషయాలైనా తనకు నచ్చితే చాలు వెంటనే ట్విట్టర్లో పెట్టేస్తాడు.

తాజాగా రాజమౌళి పెద్దన్న కీరవాణి ఇటీవల డెట్రాయిట్‌లో చేసిన ఓ లైవ్ కాన్సర్ట్ వెరైటీ ప్రయోగం చేసారు. ముఖ్యంగా తన ఆర్కెస్ట్రాలోని సభ్యులను, వారు వాయించే వాయిద్యాల గురించి ఓ పాట రూపంలో పరిచయం చేశాడు. పేరుపేరున వారి గురించి పాటలో వివరించాడు. ఇది రాజమౌళికి బాగా నచ్చేయడంతో ఆ వీడియో ట్విట్టర్లో పెట్టేసాడు. ఆ వీడియో మీకూ బాగా నచ్చుతుంది. ఓ లుక్కేయండి మరి...

ప్రస్తుతం కీరవాణి రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓం నమో వెంకటేశాయ సినిమాతో పాటు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బాహుబలి-2' సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ మధ్య కాస్త గ్యాప్ దొరకడంతో కీరవాణి డెట్రాయిట్ లో లైవ్ కాన్సెర్ట్ ప్లాన్ చేసారు.

English summary
Watch Orchestra intro song - MM Keeravaani Live Concert United States 2016.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu