twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఒబామా’ కుటుంబాన్ని వరించిన ఆస్కార్.. ప్రశంసలతో ముంచెత్తిన బరాక్ ఒబామా

    |

    అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్థాపించిన ప్రొడక్షన్ హౌస్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన తొలి డాక్యుమెంటరీ అమెరికన్ ఫ్యాక్టరీకి ఆస్కార్ దక్కడం విశేషం. ఈ డాక్యుమెంటరీని బరాక్ ఒబామా, మిచెలీ ఒబామా ప్రొడక్షన్ హౌస్ నిర్మించి రిలీజ్ చేసింది. ఈ డాక్యుమెంటరీని ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకులకు అందించింది.

     కార్మికుల సమస్యలను అస్త్రంగా

    కార్మికుల సమస్యలను అస్త్రంగా

    ఇక అమెరికన్ ఫ్యాక్టరీ డాక్యుమెంటరీ అనేక సమస్యలను వేలెత్తి చూపింది. ఫ్యాక్టరీలలో కార్మికులు పడే వెతలు, గ్లోబలైజేషన్ వల్ల కలిగే అనర్థాలు, ఫ్యాక్టరీలను యాంత్రీకరణ చేయడం వల్ల ఉద్యోగులు పడే కష్టాలను అద్భుతంగా చిత్రీకరించారు. ఈ డాక్యుమెంటరీ విమర్శకులు ప్రశంసలు కూడా అందుకొన్నది.

     అమెరికన్ ఫ్యాక్టరీకి గట్టి పోటీ

    అమెరికన్ ఫ్యాక్టరీకి గట్టి పోటీ

    ఇలాంటి అమెరికన్ ఫ్యాక్టరీ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో గట్టి పోటీ ఎదురైంది. హానీలాండ్, ది కేవ్, ది ఎడ్జ్ ఆఫ్ డెమాక్రసీ, ఫర్ సామా లాంటి డాక్యుమెంటరీల నుంచి పోటీ ఎక్కువగానే ఎదురైంది. అయినా విమర్శకులను, జ్యూరీలను మెప్పించి ఆస్కార్‌ను దక్కించుకొన్నది.

    ఒబామా సంతోషం.. ప్రశంసలు

    ఒబామా సంతోషం.. ప్రశంసలు

    తన కుటుంబం స్థాపించిన ప్రొడక్షన్ హౌస్‌కు ఆస్కార్ అవార్డు దక్కడంపై బరాక్ ఒబామా సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిత్ర యూనిట్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. క్లిష్టమైన, హ‌ృదయాన్ని కదిలించే అంశాలను అద్బుతంగా తెరకెక్కించారు. ఆర్థిక వ్యవస్థలో మార్పుల వల్ల మానవ ప్రపంచం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటుదనే విషయాన్ని చక్కగా చెప్పారు. ప్రతిభావంతులైన ఇద్దరు ఫిలిం మేకర్స్ ఆస్కార్‌ను మా ఇంటికి తీసుకొచ్చారు అని ఒబామా ఓ సందేశంలో పేర్కొన్నారు.

    అమెరికన్ ఫ్యాకర్టీ కథ ఏమిటంటే

    అమెరికన్ ఫ్యాకర్టీ కథ ఏమిటంటే

    అమెరికన్ ఫ్యాక్టరీ కథ ఏమిటంటే.. చైనాకు చెందిన పారిశ్రామికవేత్త కావో డేవాంగ్ కొనుగోలు చేసిన ఫుయావో ప్లాంట్‌కు సంబంధించినది. ఈ ఫ్యాక్టరీలో సుమారు 2200 మంది అమెరికన్లు, 200 మంది చైనా కార్మికులు పనిచేస్తుంటారు. వారి మధ్య సాంస్కృతిక పరమైన విభేదాలు తలెత్తుతాయి. ఫ్యాక్టరీ లక్ష్యాలను అందుకోలేకపోవడంతో టెన్షన్ మొదలవుతుంది. అలాంటి సమయంలో కార్మికులు ఎలా సక్సెస్‌ను సాధించారనేది ఈ చిత్ర కథ.

    English summary
    Oscars awards 2020 Live Updates: The 92nd Academy Awards started at the Dolby Theatre in Los Angeles. Brad Pitt bags the Best Actor in a Supporting Role. Priyanka Chopra away from Oscars 2020. Brad pitt won best supporting actor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X