»   » నన్ను చూసి మిగతా హీరోలు కాఫీ కొడుతున్నారు: బాలకృష్ణ

నన్ను చూసి మిగతా హీరోలు కాఫీ కొడుతున్నారు: బాలకృష్ణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

దాసరితో నేను చేసిన పరమవీర చక్ర తొంభై నాలుగవ చిత్రం. నా వందో సినిమా స్పెషల్ గా ఉంటుంది. ఎక్కువ సినిమాలు ఒప్పుకుని చేస్తున్నాను కాబట్టి త్వరగానే వంద పూర్తవుతుంది. నన్ను చూసి మిగతా హీరోలు కూడా ఎక్కువ సినిమాలు ఒప్పేసుకుంటున్నారు అంటున్నారు నందమూరి బాలకృష్ణ. అలాగే నాకు కుదిరినట్టుగా అందరికీ సినిమాలు కుదరకపోవచ్చుకూడా. ఎందుకంటే నా ఇన్వాల్మెంట్, నిర్ణయాలు చాలా వేగంగా ఉంటాయి. అలాగే భాధ్యతను దర్శకుడి మీదే పూర్తిగా వదిలేయను. అంతేగాక ఇకనుంచి నేను వేసే గెటప్స్ ప్లానింగ్ నాదే. అయినా వేరే హీరోలు అలాంటి గెటప్స్ వేసినా చూడరు అని సగర్వంగా చెప్పుకొచ్చారు ఆయన.

అలాగే ముప్ఫైఐదేళ్లుగా పరిశ్రమలో అన్ని రకాల పాత్రలూ చేశాను. నాకెప్పుడూ ఇమేజ్ అనేది ప్రతిబంధకం కాలేదు. ఫలానా విధంగా చేయాలని అనుకుంటే ఎంతటి సాహసానికైనా పూనుకుంటాను. ఎవరో వచ్చి మిమ్మల్ని కొత్తగా చూపిస్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. అలాంటివాళ్లను దగ్గరక్కూడా రానివ్వను. అందుకే నా మైండ్ సెట్ కు దగ్గరైన దర్శకులతోనే పనిచేస్తాను. నా ఇమేజ్ ఎంతవరకూ వాడుకోవాలనేది నా చేతుల్లో ఉంది. నా నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారనేది గమనిస్తే చాలు. కథ మమ్మల్ని డామినేట్ చేసినా ఫర్వాలేదు కానీ, టెక్నిక్ మాత్రం ఎప్పుడూ మమ్మల్ని డామినేట్ చేయకూడదు అంటూ తన ఆలోచనలు వివరించారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu