»   » జూ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వం : ఓయూ జేఏసీ

జూ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వం : ఓయూ జేఏసీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ సినిమాలను తెలంగాణ ప్రాంతంలో ఆడనివ్వమని ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ గురువారం హెచ్చరించింది. సమైక్యాంధ్రకు మద్దతుగా జూ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఓయూ జేఏసీ ఈ హెచ్చరికలు జారీ చేసింది.

రాష్ట్ర విభజన నిర్ణయం వల్ల తెలుగు సినిమా పరిశ్రమకు భారీగా నష్టలు తప్పడం లేదు. చిరంజీవి తన మంత్రి పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ....ఆయన కుటుంబ సభ్యుల సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించడంతో 'ఎవడు', 'అత్తారింటికి దారేది' చిత్రాల విడుదల ఆగిపోయింది.

ఇప్పుడు హరికృష్ణ సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించడంతో తెలంగాణ వాదులు భగ్గుమన్నారు. ఆయన కుమారుడు జూ ఎన్టీఆర్ సినిమాలను తెలంగాణ ప్రాంతంలో ఆడనివ్వబోమని హెచ్చరించారు. దీంతో ప్రస్తుతం జూ ఎన్టీఆర్ నటిస్తున్న 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం అనుకున్న సమయానికి విడుదల అవుతుందో? లేదో? అన్న సందేహాలు నెలకొన్నాయి.

ఈచిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 27న విడుదల చేసి తీరుతామని గతంలో దర్శకుడు హరీష్ శంకర్ ప్రకటించారు. మరి హరీష్ శంకర్ మాటల నిలబడుతుందో? లేదో?. ఆగస్టు మూడో వారంలో ఆడియో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

English summary
OU JAC warns Jr NTR films. 'We condemn Harikrishna’s resignation in support of the Samaikhyandhra agitation. We will not allow the screening of Jr NTR’s films in the Telangana region', said members of the OU JAC.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu