»   »  పన్నీర్ సెల్వంకే మా మద్దతు: వెంకయ్య నాయుడు, ఎందుకంటే ?

పన్నీర్ సెల్వంకే మా మద్దతు: వెంకయ్య నాయుడు, ఎందుకంటే ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూఢిల్లీ/చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ముఖ్య అనుచరుడైన పన్నీర్ సెల్వంకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఆ రాష్ట్రానికి ఎలాంటి సహాయం కావాలన్నా కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా చేస్తుందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు.

గురువారం ఆయన న్యూఢిల్లీలో తమిళ మీడియాతో మాట్లాడారు. జయలలిత స్వయంగా గతంలో పన్నీర్ సెల్వంను ముఖ్మమంత్రిగా చేసిన విషయం గుర్తు చేశారు. పన్నీర్ సెల్వంను ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, అయన ప్రజాప్రనిధి అని చెప్పారు.

Our support is to the elected leader O.Pannerselvam: says BJP

జయలలిత మూడు సార్లు పన్నీర్ సెల్వంను నమ్మి ఆమె భాద్యతలు అప్పగించారు. జయలలిత మరణించిన తరువాత ఆమె అడుగుజాడల్లో పన్నీర్ సెల్వం నడుచుకుంటారని మేము అనుకుంటున్నామని వెంకయ్యనాయుడు అన్నారు.

అయితే అన్నాడీఎంకే పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఎలాంటి పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోమని, ఆ అవసరం బీజేపీకి లేదని వెంకయ్యనాయుడు కుండలు బద్దలు కొట్టి చెప్పారు. తమిళనాడుకు ఎలాంటి సహాయం కావాలన్నా మోడీ ప్రభుత్వం చేస్తుందని వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు.

తమిళనాడులో ప్రస్తుతం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో వెంకయ్యనాయుడు పన్నీర్ సెల్వంకు మద్దతుగా మాట్లాడటంతో అన్నాడీఎంకేలోని ఓ వర్గం వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరో వర్గంలోని నాయకులు ఇప్పుడు ఏమాట్లాడాలో తెలియక అయోమయంలో పడిపోయారు.

English summary
Our support is to the elected leader O.Pannerselvam, says union minister Venkaiah Naidu.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu