»   » వాణీజయరామ్‌కు అవార్డు, సుశీలకు జమున ముద్దు!(ఫోటోలు)

వాణీజయరామ్‌కు అవార్డు, సుశీలకు జమున ముద్దు!(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ గాయని పి.సుశీల తన పేరుపై 2008లో ట్రస్టు నెలకొల్పి సంగీత కళాకారులకు ప్రతీఏటా అవార్డును ప్రధానం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 2013 సంవత్సరానిగాను పి.సుశీల అవార్డును ప్రముఖ గాయని వాణీజయరామ్‌కు అందజేసారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆమెకు జ్ఞాపికతో పాటు రూ. లక్ష రూపాయల చెక్కు అందజేసారు.

ఈ సందర్భంగా పి.సుశీల మాట్లాడుతూ...తన అద్భుత గానామృతంతో ప్రేక్షకులను ఓలలాడించిన వాణీజయరామ్‌ను ఈ ఏడాది అవార్డు ప్రధానం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. తెలుగు, తమిళం, ఇంగ్లీషు, స్పానిష్ వంటి వివిధ బాషల్లో ఆమె పాటలు పాడారని అన్నారు.

వాణి జయరామ్ మాట్లాడుతూ...తన జీవితంలో ఇది మరుపురాని మంచిరోజని తెలిపారు. పాఠశాల, కళాశాల రోజుల్లోనే పాటలు పాడటం మొదలు పెట్టిన తాను సుశీల పాటలతో ఎంతో ప్రేరణ చెందానని తెలిపారు. ఆమె పేరుతో నెలకొల్పిన ఈ అవార్డును అందుకోవడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

వాణీజయరామ్‌కు సత్కారం

వాణీజయరామ్‌కు సత్కారం


తెలుగు సినిమా పరిశ్రమ గాయినీ గాయకుల సమక్షంలో వాణీజయరామ్‌కు పి సుశీల అవార్డుతో సత్కరిస్తున్న దృశ్యం.

సుశీలకు జమున ముద్దు

సుశీలకు జమున ముద్దు


పి సుశీల, జమున ఎంతో ఆత్మీయంగా మెలుగుతారు. వారి మధ్య ఎంత ఆత్మీయతానుబంధం ఉందో నిరూపించే దృశ్యం.

జమున మాట్లాడుతూ..

జమున మాట్లాడుతూ..


సీనియర్ నటి జమున మాట్లాడుతూ...పి సుశీల ఏ హీరోయిన్‌కి పాట పాడినా వారి గొంతును అనుకరించి పాటలు పాడేవారని, ఆమె గొంత తనకైతే ఎంతో బాగా సరిపోయేదని అన్నారు. తనకు నటిగా ఎంతో మంచి పేరు రావడం వెనక సుశీల గళం ఎంతగానో దోహదం చేసిందని అన్నారు.

హాజరైన ప్రముఖులు

హాజరైన ప్రముఖులు


ఈ కార్యక్రమాంలో తెలుగు సినిమా సంగీత ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు, నటులు హాజరయ్యారు.

English summary
Presentation Of P Susheela Award 2013 To Playback Singer Vani Jairam is an event that took place on 09-Dec-2013 in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu