twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమిళనాడుని తాకిన "పద్మావతి": థియేటర్ల ముందు పోరాటాలే వీ.హెచ్.పీ హెచ్చరిక

    బాలీవుడ్‌ భారీ చారిత్రాత్మక చిత్రం పద్మావతిపై ఉత్తరాదిలో రచ్చరచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే.

    |

    Recommended Video

    తమిళనాడుని తాకిన 'పద్మావతి' దుమారం..!

    బాలీవుడ్‌ భారీ చారిత్రాత్మక చిత్రం పద్మావతిపై ఉత్తరాదిలో రచ్చరచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మొన్నటివరకూ తమిళ్ ఇండస్ట్రీలో వచ్చిన మెర్సల్ వేడి చల్లారక ముందే ఇప్పుడు సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమామీద నిరసనలు మామూలుగాలేవు.

     సంజయ్‌లీలా భన్సాలీ

    సంజయ్‌లీలా భన్సాలీ

    దాదాపు దేశవ్యాప్తంగా బందులూ,నిరసనలూ జరుగుతున్నాయి. దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ చరిత్రను వక్రీకరించారని రాజ్‌పుత్‌లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సినిమాలో మహారాణి పద్మావతి, అల్లావుద్దీన్‌ ఖిల్జీలమధ్య లవ్‌ సీన్స్‌ ఉన్నాయన్నది వారి ప్రధాన ఆరోపణ.

     డిసెంబర్‌ ఒకటవ తేదీ

    డిసెంబర్‌ ఒకటవ తేదీ

    ఆ సన్నివేశాలను తొలగించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్‌ ఇస్తున్నారు. దీపికాపడుకొనే పద్మావతిగా టైటిల్‌ పాత్రను పోషించిన ఈ చిత్రం డిసెంబర్‌ ఒకటవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది.

    దీపికాను చంపుతామంటూ

    దీపికాను చంపుతామంటూ

    అయితే చరిత్రను తప్పుగా చిత్రీకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న ఈ చిత్ర విడుదలను అడ్డుకుంటామంటూ ఉత్తరాదిలో ఆందోళనలు ఇప్పటికే మిన్నంటుతున్నాయి. అందులో నటించిన నటి దీపికాపడుకొనేను చంపుతామంటూ బెదిరింపులు కూడా వస్తున్న నేపథ్యంలో ఆ సెగలిప్పుడు తమిళనాడును తాకుతున్నాయి.

    విశ్వ హిందు పరిషత్‌

    విశ్వ హిందు పరిషత్‌

    ఈ చిత్ర విడుదలను హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.విశ్వ హిందు పరిషత్‌ కోవై జిల్లా అధ్యక్షుడు శివలింగం,రాష్ట్రీయ రాజపుత్ర కర్ణి సేన అఖిల భారత అధ్యక్షుడు సుబ్‌దేవ్‌గిల్‌ శుక్రవారం సంయుక్తంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో పద్మావతి చిత్రంలో రాజస్థాన్‌ రాణి గురించి అవాస్తవ సన్నివేశాలను పొందుపరచారన్నారు.

     హిందూ సమాజాన్ని కించపరచడమే

    హిందూ సమాజాన్ని కించపరచడమే

    ఇది చరిత్రను తప్పుగా చిత్రీకరించడమే అవుతుందన్నారు. అలాంటి దృశ్యాలతో హిందూ సమాజాన్ని కించపరచడమేనన్నారు. ఈ చిత్ర విడుదలను తమిళ ప్రభుత్వం నిషేధించాలని, లేని పక్షంలో పద్మావతి చిత్ర ప్రదర్శనల థియేటర్ల ముందు ఆందోళనలు వంటి పలు రకాల పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు.

    English summary
    padmavati movie controversy touched tamilnadu, VHP state president of thamilanadu Shivalingam Dimands ban the Movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X