»   »  ‘పద్మావతి’ ట్రైలర్: మరో వెండితెర అద్భుతం అయ్యేలా ఉందే...

‘పద్మావతి’ ట్రైలర్: మరో వెండితెర అద్భుతం అయ్యేలా ఉందే...

Posted By:
Subscribe to Filmibeat Telugu
"Padmavati" Trailer Is Released మరో వెండితెర అద్భుతం అయ్యేలా ఉంది...

ఇండియన్ సినిమా చరిత్రలో మరో వెండి తెర అద్భుతం త్వరలో చూడబోతున్నామా? బాహుబలి తర్వాత ఇండియన్ సినీ ప్రేక్షకులు ఆ స్థాయిలో మరో గ్రాండ్ మూవీ ఆస్వాదించబోతున్నారా? అంటే అవును అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి తాజాగా విడుదలైన 'పద్మావతి' మూవీ ట్రైలర్ చూసిన తర్వాత.

ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రాణి పద్మావతి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'పద్మావతి' మూవీ అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూసిన ప్రతి ఇండియన్ ప్రేక్షకుడిలో ఇది ఎప్పుడు రిలీజవుతుందనే తపన మొదలైంది.

 1303 ముహూర్తం

1303 ముహూర్తం

పద్మావతి ట్రైలర్ సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 13.03 గంటలకు రిలీజ్ చేశారు. సరిగ్గా ఈ ముహూర్తానికే విడుదల చేయడానికి ప్రత్యేకంగా ఓ కారణం కూడా ఉంది. రాణి పద్మావతి చిత్తోర్ కోటను 1303 సంవత్సరంలో ఉల్లాఉద్దీన్ ఖిల్జీ ముట్టడించాడు. ఆ పోరాటం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.

మహ్మదీయరాజు అల్లా ఉద్దీన్

మహ్మదీయరాజు అల్లా ఉద్దీన్

ఈ చిత్రంలో మహ్మదీయరాజు అల్లా ఉద్దీన్ ఖిల్జీ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నారు. ట్రైలర్లో రణవీర్ సింగ్ పెర్ఫార్మెన్స్ టెర్రిఫిక్ గా ఉంది. భారీ శరీరంతో, ఎంతో క్రూరమైన లుక్ లో రణవీర్ సింగ్ పెర్ఫార్మెన్స్ పరంగా కూడా అదరగొట్టాడని తెలుస్తోంది.

రతన్ సింగ్ పాత్రలో

రతన్ సింగ్ పాత్రలో

ఈ చిత్రం షాహిద్ కపూర్ పద్మావతి భర్త మహారావల్ రతన్ సింగ్ పాత్రలో నటిస్తున్నాడు. రాజ్ పుత్ వంశరాజుగా రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలు సైతం లెక్కచేయని వీరుడి పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు.

‘పద్మావతి'గా టైటిల్

‘పద్మావతి'గా టైటిల్

‘పద్మావతి'గా టైటిల్ రోల్ చేస్తున్న దీపిక పదుకోన్ ఎంతో బ్యూటిఫుల్‌గా సినిమాలో కనిపించింది. ఆమె కెరీర్లో ఈ చిత్రం ది బెస్ట్ మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు.

పరిస్థితులను కళ్లకు

పరిస్థితులను కళ్లకు

1303 కాలం నాటి పరిస్థితులను కళ్లకు కట్టేలా ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టం అవుతుంది. సినిమాలో సెట్టింగ్స్, కాస్టూమ్స్ అన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి.

 రాణి పద్మావతి

రాణి పద్మావతి

14వ శతాబ్దానికి చెందిన రాణి పద్మావతి, ఆమె భర్త రావల్ రతన్ సింగ్.... అల్లా ఉద్దీన్ ఖిల్జీ చిత్తోర్ కోటను ఆక్రమించిన సందర్భంగా చోటు చేసుకున్న సంఘటలను ఫోకస్ చేస్తూ ఈ సినిమా ఉండబోతోంది.

అల్లా ఉద్దీన్ ఖిల్జీ చిత్తోర్

అల్లా ఉద్దీన్ ఖిల్జీ చిత్తోర్

చరిత్ర ప్రకారం అల్లా ఉద్దీన్ ఖిల్జీ చిత్తోర్ కోటను ఆక్రమించి... కోటను స్వాధీనం చేసుకుని రావతల్ రతన్ సింగ్ ను చంపేసిన సమయంలో.... పద్మావతితో పాటు కోటలోని మహిళలంతా అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకుంటారు. ఈ సినిమాలో కూడా పద్మావతిని అలాగే చూపిస్తారని తెలుస్తోంది.

రణవీర్ సింగ్

రణవీర్ సింగ్

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణవీర్ సింగ్, దీపిక పదుకోన్ కలిసి నటించడం ఇది మూడో సారి. గతంలో వారు రామ్-లీలా, బాజీరావు మస్తానీ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.

సినిమాపై అంచనాలు

3 నిమిషాల నిడివితో ‘పద్మావతి' ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. డిసెంబర్ 1న సినిమా విడుదల కాబోతోంది.

English summary
Padmavati trailer flaunts Sanjay Leela Bhansali’s grand canvas, as much as it showcases a fierce Ranveer Singh, a brave and beautiful Deepika Padukone and a strong Shahid Kapoor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu