twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాన్న, నేను వెళ్లాం.... నెక్ట్స్ మోక్షజ్ఞ, దేవాంశ్‌ను పంపిస్తా: బాలయ్య

    పైసా వసూల్ ఆడియో సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు మోహన్ బాబు ముఖ్య అతిథిగా వచ్చారు.

    By Bojja Kumar
    |

    నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా భ‌వ్య‌క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ఫై పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వి.ఆనందప్ర‌సాద్ నిర్మించిన చిత్రం పైసావ‌సూల్‌. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ అందించిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం హైద‌రాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు.

    ఈ కార్య‌క్ర‌మానికి క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. గౌర‌వ అతిథిగా ఎ.కోదండ‌రామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ... ''సాధార‌ణంగా నేను సినిమా పరిశ్రమలో పెద్ద‌గా ఎవరినీ కలవను. కానీ మోహన్‌బాబుగారిని, వారి పిల్లలైన విష్ణు, మంచు ల‌క్ష్మి, మ‌నోజ్‌ల‌ను మాత్రమే కలుస్తా. ఆ కుటుంబంతోనే నాకు ఎక్కువ చనువు అని తెలిపారు.

    పూరితో చేయడంపై

    పూరితో చేయడంపై

    డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌తో ఎప్పటినుంచో చేయాలని ఉంది. కానీ కాస్త లేట్‌ అయింది. పూరిని ఎప్పుడూ టెంపర్‌లో లూజ్‌ కావడం, విసుక్కోవడం వంటివి ఎప్పుడూ చూడలేదు. సినిమాను అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేశాడు అని బాలయ్య తెలిపారు.

    అలాంటివి పట్టించుకోను

    అలాంటివి పట్టించుకోను

    ఆర్టిస్టులకు చాలెంజ్‌ ఎప్పుడు వస్తుందంటే ఒక మంచి సినిమా చేసిన తర్వాత ఇమేజ్‌ అడ్డు వచ్చినప్పుడు సవాల్‌ ఎదురవుతుంది. నేను అలాంటివి ఎక్కువగా ఆలోచించను. వివిధ నేపధ్యాల‌లో సినిమాలు చేశాను... చేస్తాను అంటూ పైసా వసూల్ సినిమాను ఉద్దేశించి బాలయ్య వ్యాఖ్యానించారు.

    పైసా వసూల్ భారీగా ఉంది

    పైసా వసూల్ భారీగా ఉంది

    గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమాను 79 రోజుల్లో పూర్తి చేస్తే, ఈ సినిమాను 78 రోజుల్లో పూర్తి చేశాం. అలా ఒక్కో సినిమాకూ ఒక్కో రోజుకూ తగ్గించుకుంటూ వస్తున్నాం. సినిమా చాలా భారీగా ఉంది. సెట్స్‌, కార్‌ ఛేజ్‌లు భారీగా ఉన్నాయి. అందరినీ మంచి అట్మాస్‌ఫియర్‌ క్రియేట్‌ చేసేది ముందు నిర్మాత, తర్వాత దర్శకుడు. అలాంటి అద్భుతమైన మనిషి పూరి. మా ఇద్దరికీ బాగా జెల్‌ అయింది. ఆయనకు ఎప్పుడూ పని గురించే ఆలోచన ఉంటుంది. మంచి సినిమా చేయాలనే తపన ఆయనకు ఉంటుందని బాలయ్య తెలిపారు.

    ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు

    ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు

    సినిమాను సెప్టెంబ‌ర్ 29న అనుకున్నవాళ్లం ఐదు వారాల ముందు విడుదల చేస్తున్నాం. సినిమా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్‌ కాలేదు. సినిమాకు అవసరమైనంతవరకే ఈ సినిమాలో చేశాం. ఛార్మి అన్ని బాధ్యతలను చాలా బాగా నెరవేర్చింది. ఇంత బాగా విడుదల చేయడానికి కారణం ఛార్మి. సినిమా బావుందని ఎడిటర్‌ చెప్పారు. టెక్నీషియన్లు చాలా బాగా చెప్పారు. అనూప్‌ మంచి సంగీతాన్నిచ్చారని బాలయ్య తెలిపారు.

    మోక్షజ్ఞని, దేవాంశ్ ను పంపుతా

    మోక్షజ్ఞని, దేవాంశ్ ను పంపుతా

    ఫైటర్స్‌ అసోసియేషన్ 25సంవ‌త్సరాల ఫంక్ష‌న్‌కి 25కి నాన్నగారు అటెండ్ అయితే, 50 సంవ‌త్స‌రాల వేడుక‌కి నేను వెళ్లాను. అలాగే 75 సంవ‌త్స‌రాల వేడుక‌కి మోక్ష‌జ్ఞ‌ని, 100 సంవ‌త్స‌రాల వేడుక‌కు దేవాంశ్‌ను పంప‌తాన‌ని మాటిచ్చాను అని బాలయ్య తెలిపారు.

    బాలయ్య మందు పాట గురించి మోహన్ బాబు

    బాలయ్య మందు పాట గురించి మోహన్ బాబు

    మోహన్ బాబు మాట్లాడుతూ.... ‘బాలయ్య వండర్‌ఫుల్‌ యాక్టర్‌. ప్రతిపిక్చర్‌లోనూ ఒక వెరైటీ, ఒక డైలాగ్‌ ఉంటుంది. అన్నయ్యని ఇమిటేట్‌ చేశానంటే నేను ఒప్పుకోను. చూసి బాగోలేకపోతే నేను ఫోన చేసి చెప్తా. రూ.101కోట్లకన్నా ఎక్కువ కలెక్ట్‌ చేయాలి. చంద్రబాబుకు మందుతాగే అలవాటు లేదు. ఎవరు ఇవ్వాలి?.. ఎందుకు పాడావో నాకు అర్థం కాలేదు. ధైర్యం చేసి ఒక పాట పాడటం మామూలు విషయం కాదు. రిథమ్‌కు తగ్గట్టు అద్భుతంగా పాడారు. సక్సెస్‌, ఫెయిల్యూర్‌ గోస్‌ టు ద డైరక్టర్‌. డైరక్టర్‌ క్రియేటర్‌. నాకు పూరి అంటే చాలా ఇష్టం. నేను, మా బావా ప్రభాస్‌ బుజ్జిగాడులో పనిచేశాం. అంత ఫాస్ట్‌గా తీసే డైరక్టర్‌ని నేను చూడలేదు' అన్నారు.

    అలాంటి హీరో బాలయ్య మాత్రమే

    అలాంటి హీరో బాలయ్య మాత్రమే

    పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ ‘‘ఆనందప్రసాద్‌గారితో వర్క్‌ చేయడం చాలా బావుంది. ప్రొడక్షన్‌తో పాటు పబ్లిసిటీ కూడా బాగా చేస్తున్నారు. బాలయ్యతో ఇన్నాళ్లు చేయక మిస్‌ అయ్యా. ఇప్పుడు షూటింగ్‌ పూర్తయ్యాక రోజూ మిస్‌ అవుతున్నా. ఇలాంటి హీరోని నేను ఇప్పటిదాకా చూడలేదు. క్రమశిక్షణ, అంకితభావం ఉన్న నటుడు ఆయన. ఇలాంటి డెడికేషన్‌ నేను బాలయ్యకన్నా ముందు మోహనబాబుగారిలో చూశా. రామారావుగారి లక్షణాలన్నీ బాలయ్యగారిలో ఉన్నాయి. బాలయ్యగారి ఎనర్జీని మిస్‌ అవుతున్నా. బాల‌కృష్ణ‌గారిఇ సినిమా అంటే ఇష్టం. లైట్‌ పోతుంది అని అందరినీ పిలిచి గబగబా కెమెరా పక్కకి వెళ్లి నిలుచున్న హీరో ఇండస్ట్రీలో బాలయ్య ఒక్కరే. సెప్టెంబర్‌ 29న విడుదల చేయాలనుకుంటే ఐదు వారాల ముందు తనకు కావాలని నిర్మాతగారు అడిగారు. 5 వారాల ముందు రావడానికి ఛార్మి చాలా ప్లాన్‌ చేసింది. స‌పోర్ట్ చేసిన అందరికీ థాంక్స్‌' అని పూరి అన్నారు.

    నిర్మాత వి.ఆనంద ప్ర‌సాద్ మాట్లాడుతూ

    నిర్మాత వి.ఆనంద ప్ర‌సాద్ మాట్లాడుతూ

    బాలయ్య 101వ సినిమా మేము చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా బాలయ్య అభిమానుల్లో 101 మంది పేదవిద్యార్థులకు సాయం చేశాం. ఈ చిత్రం విడుదల సందర్భంగా ఒక్కొక్కరికీ రూ.10వేలు ఇస్తాం. నందమూరి తారకరత్నగారి ఆధ్వర్యంలో 236యూనిట్ల బ్లడ్‌ను ట్రస్ట్‌కు అందజేశారు. సామాజిక దృక్పథంలో మంచి పనులు చేస్తూ వారికి మంచి పేరు తేవాలి. సెప్టెంబర్‌ 1న ఈ సినిమా మీ ముందుకు రానుంది. పూర్తి మాస్‌ మసాలా సినిమా ఇది, అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది' అన్నారు.

    English summary
    Paisa Vasool Audio Success Meet held at Hyderabad. Balakrishna, Shriya Saran, Charmi, Musskan Sethi, Kyra Dutt, Puri Jagannath, V Anand Prasad, Mohan Babu, Ali, A Kodandarami Reddy, Simha, Bhaskarabhatla at the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X