»   » ‘పైసా వసూల్’ పబ్లిక్ టాక్, ఆడియన్స్ రివ్యూ

‘పైసా వసూల్’ పబ్లిక్ టాక్, ఆడియన్స్ రివ్యూ

Posted By:
Subscribe to Filmibeat Telugu
"Paisa Vasool" Public Talk

బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పైసా వసూల్' చిత్రం గ్రాండ్ గా రిలీజైంది. 'గౌతమీపుత్ర శాతకర్ణి' లాంటి భారీ విజయం తర్వాత బాలయ్య చేస్తున్న 101 మూవీ ఇది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచింది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ మేకింగ్ స్టైల్ చాలా డిఫరెంటుగా ఉంటుంది. బాలయ్య అంటే మాస్, యాక్షన్ దబ్బిడి దిబ్బిడే. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

ట్రైలర్లు, టీజర్లు చూసిన తర్వాత బాలయ్యను ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చూడనంత స్టైలిష్‌, విభిన్నంగా పూరి స్క్రీన్ మీద ప్రజంట్ చేయబోతున్నారని ఫ్యాన్స్ ఒక అంచనాకు వచ్చారు. ఇక సినిమా ఏమేరకు ప్రేక్షకులకు ఏమేరకు ఎక్కుతుందనేదే తరువాయి.


ప్రీమియర్, బెనిఫిట్ షోలు

ప్రీమియర్, బెనిఫిట్ షోలు

తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుఝామునే బెనిఫిట్ షోలో పడగా, యూఎస్ఏలో అంతకంటే ముందే ప్రీమియర్ షోలో ప్రదర్శితం అయ్యాయి. సినిమా గురించి టాక్ ఇప్పటికే ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా స్ప్రెడ్ అయింది.


బాలయ్య డిఫరెంటుగా కనిపించారు

బాలయ్య డిఫరెంటుగా కనిపించారు

బాలయ్యకు ఇప్పటి వరకు ఉన్న స్క్రీన్ ఇమేజ్‌తో పోల్చితే ఈ చిత్రంలో చాలా డిఫరెంటుగా కనిపించారనే టాక్ వినిపిస్తోంది.బాలయ్య స్ట్రెంత్ పూర్తిగా ఉపయోగించుకోలేదట

బాలయ్య స్ట్రెంత్ పూర్తిగా ఉపయోగించుకోలేదట

బాలయ్య కాస్త డిఫరెంటుగా చూపిద్దామని ఆరాటపడిన పూరి.... బాలయ్య స్ట్రెంత్ పూరిగా ఉపయోగించుకోలేక పోయాడు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


తేడా సింగ్

తేడా సింగ్

బాలయ్య ఈ చిత్రంలో ‘తేడా సింగ్' అనే పాత్రలో నటించాడు. అయితే తేడా సింగ్ అనే క్యారెక్టరైజేషన్ అన్ని సీన్లలో వర్కౌట్ కాలేదనే టాక్ వినిపిస్తోంది.


ఫస్టాఫ్, సెకండాఫ్

ఫస్టాఫ్, సెకండాఫ్

ఫస్టాప్ యావరేజ్ గా ఉందని, సెకండాఫ్ కాస్త బెటర్ గా ఉందని అంటున్నారు. సినిమాలో 3 పాటలు, పోర్చుగల్ ఎపిసోడ్ బావుందనే టాక్ వినిపిస్తోంది.పూరి జగన్నాథ్

పూరి జగన్నాథ్

ఈ సినిమా చూసిన చాలా మంది పూరి జగన్నాథ్ ఈ మాఫియా బ్యాగ్రౌండ్ నేపథ్యాల నుండి బయటకు రావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.బాలయ్య ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్

బాలయ్య ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్

బాలయ్య ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ అభిమానులను, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్

అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్

సినిమా అభిమానులుకు బాగా నచ్చుతుందని, ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా ఇష్టపడే ఎలిమెంట్స్ ఉన్నాయని అంటున్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి రివ్యూ మరికాసేపట్లో....English summary
Director Puri Jagannadh's Telugu movie Paisa Vasool starring Nandamuri Balakrishna and Shriya Saran has received received mixed reviews and ratings from audiences, who are calling it a grand treat for Balayya fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu