»   » బాలకృష్ణ ఫ్యాన్స్‌కు హ్యాపీ న్యూస్: ‘పైసా వసూల్’ రిలీజ్ డేట్ ఖరారు

బాలకృష్ణ ఫ్యాన్స్‌కు హ్యాపీ న్యూస్: ‘పైసా వసూల్’ రిలీజ్ డేట్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్న సినిమా 'పైసా వసూల్‌'. ఇటీవల విడుదలైన ఈ సినిమా స్టంపర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. అభిమానులయితే ఫుల్‌ ఖుషీగా ఉన్నారు.

ఈ సంతోషంలో వారికి ఇంకో శుభవార్త. 'పైసా వసూల్‌'ను సెప్టెంబర్‌ 1న విడుదల చేస్తున్నట్టు నిర్మాత వి. ఆనందప్రసాద్‌ ప్రకటించారు. ఈ సినిమా చిత్రీకరణ, డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. అనూప్‌ రూబెన్స్‌ సంగీతమందించిన పాటల్ని అతి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


అభిమానులకు పండగే...

అభిమానులకు పండగే...

ఈ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ- ‘‘నందమూరి అభిమానులు కోరుకునే అంశాలన్నీ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. బాలకృష్ణగారు ఫుల్‌ ఎనర్జిటిక్‌ పాత్రలో ఇరగదీసి నటించారు. ముఖ్యంగా యాక్షన్‌ సీక్వెన్స్‌లను ఆయన డూప్‌ లేకుండా చేశారు. ఇప్పటివరకు ఆయన్ను చూడని విధంగా, ఓ కొత్త పాత్రలో ఇందులో చూస్తారు. తొలిసారి బాలకృష్ణగారితో పని చేస్తున్నందుకు గర్వంగానూ, ఆనందంగానూ ఉంది. మా నిర్మాత ఆనందప్రసాద్‌గారు ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా సినిమా బాగా రావడానికి కృషి చేశారు'' అన్నారు.


Balakrishna's Paisa Vasool Stumper Release Date Confirmed
పైసా వసూల్‌ మూవీ

పైసా వసూల్‌ మూవీ

నిర్మాత వి. ఆనందప్రసాద్‌ మాట్లాడుతూ- ‘‘ఇటీవల విడుదలైన ‘పైసా వసూల్‌' స్టంపర్‌కు అద్భుత స్పందన లభిస్తోంది. ‘తమ్ముడూ... నేను జంగిల్‌ బుక్‌ సినిమా చూడలె . కాని అందులో పులి నాలాగే ఉంటుందని చాలామంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి', ‘మందేసిన మదపుటేనుగునిరా! క్రష్‌ ఎవ్రీవన్‌' డైలాగులు అభిమానులను అలరిస్తున్నాయి. సినిమా కూడా ఇదే రేంజ్‌లో ఉంటుంది. సెప్టెంబర్‌ 1న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. బాలకృష్ణగారి ఇమేజ్‌కి, కథకు తగ్గ పాటలను అందించారు అనూప్ రూబెన్స్ . త్వరలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.


తెర వెనక

తెర వెనక

శ్రియ, ముస్కాన్, కైరా దత్‌ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్‌-హాలీవుడ్‌ నటుడు కబీర్‌ బేడి ప్రత్యేక పాత్ర పోషించారు. ఇంకా అలీ, పృథ్వీ, పవిత్రా లోకేష్, విక్రమ్‌ జిత్‌ తదితరులు నటించిన ఈ సినిమాకు సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.అందరినీ నలిపేస్తా..... బాలయ్య ‘పైసా వసూల్' స్టంపర్ అదుర్స్

అందరినీ నలిపేస్తా..... బాలయ్య ‘పైసా వసూల్' స్టంపర్ అదుర్స్

పూరికి ఈ మధ్య సరైన హిట్ లేక పోవడంతో ఆయన బాలయ్యతో చేస్తున్న ‘పైసా వసూల్' మూవీని కొందరు చాలా తక్కువ అంచనా వేశారు. నట సింహం వేట ఎలా ఉండబోతుందనేది దర్శకుడు పూరి జగన్నాథ్‌ ‘స్టంపర్‌' అనే చిన్న శాంపిల్ తో చూపించారు. దీంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. విలన్స్‌కు 101 ఫీవర్‌... ఫ్యాన్స్‌కు బంపర్‌ ఆఫర్‌... స్టంపర్‌ ఈజ్‌ సింప్లీ సూపర్‌... సోషల్‌ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే డిస్కషన్‌ .


మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండిEnglish summary
Paisa Vasool Releasing On September 1st, 2017. Paisa Vasool produced by V. Anand Prasad under Bhavya Creations banner and directed by Puri Jagannadh. Starring Nandamuri Balakrishna, Shriya Saran, Vikramjeet Virk in the lead roles and music composed by Anup Rubens.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu