»   » అందరినీ నలిపేస్తా..... బాలయ్య ‘పైసా వసూల్’ స్టంపర్ అదుర్స్

అందరినీ నలిపేస్తా..... బాలయ్య ‘పైసా వసూల్’ స్టంపర్ అదుర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ - పూరి జగన్నాథ్ ల సెన్సేషనల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'పైసా వసూల్' . భవ్య క్రియేషన్స్ పతాకం పై వి. ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా 'పైసా వసూల్' కి సంబంధించిన 'స్టంపర్' విడుదల చేశారు.

'అన్నా... రెండు బాల్కనీ టికెట్లు కావాలి' అంటూ బాలయ్య చెప్పే డైలాగుతో స్టంపర్ మొదలైంది. అసలు ఇలాంటి డైలాగులు బాలయ్య నుండి ఊహించి ఉండం. కానీ ఇది సినిమా థియేటర్ సీన్ అనుకుంటే పొరపాటే... ఇదో యాక్షన్ సీన్. అదే మరి పూరి క్రియేటివిటీ అంటే...


వెరైటీగా యాక్షన్ సీన్

వెరైటీగా యాక్షన్ సీన్

బాలయ్య: రెండు బాల్కనీ టికెట్లు కావాలి
విలన్: ఇది సినిమా కాదు..
బాలయ్య: సినిమా కాకపోతే మరేమిటి? ఐ యామ్ ది హీరో... యూఆర్ ది కమెడియన్ అండ్ విలన్ టచ్డ్ మై హీరోయిన్... ది ఈజ్ యాక్షన్ ఫిల్మ్ అంటూ విలన్లను చితక్కొడతాడు.


బాలయ్య స్టైల్ అదుర్స్

బాలయ్య స్టైల్ అదుర్స్

స్టంపర్‌లో బాలయ్య స్టైల్ చూసిన అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. బాలయ్యను ఇంత స్టైలిష్ గా ఎప్పుడూ చూలేదని... దర్శకుడు పూరి జగన్నాథ్ ఆయన్ను చాలా స్టైలిష్ గా ప్రజంట్ చేశారని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.


గన్ తిప్పే స్టైల్ కేక

గన్ తిప్పే స్టైల్ కేక

ఈ చిత్రంలో బాలయ్య గన్ తిప్పే స్టైల్ అద్భుతంగా ఉందని..... ఈ టీజర్ చూస్తుంటే సినిమా హాలీవుడ్ రేంజిలో ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


బాలయ్య రోటీన్ స్టైల్‌కు భిన్నంగా

బాలయ్య రోటీన్ స్టైల్‌కు భిన్నంగా

ఇప్పటి వరకు బాలయ్య సినిమాల్లో వేటకొడవళ్లతో నరకడం, గొడ్డళ్లతో వేటాడటం లాంటి దేశీ యాక్షన్ సీన్లే చూశాం. అయితే పూరి ఇందులో కత్తులు, గొడ్డళ్లు లేకుండా ఇప్పటి ట్రెండుకు తగిన విధంగా సినిమా తెరకెక్కించాడని స్పష్టమవుతోంది.


పులి నాలాగే ఉంటుంది

పులి నాలాగే ఉంటుంది

తమ్మడు నేను జంగల్ బుక్ సినిమా చూడలా... కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు. అది నిజయో కాదో మీరే చెప్పాలి... అంటూ బాలయ్య చెప్పిన డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తోంది.


మాస్ మసాలా సాంగ్స్

మాస్ మసాలా సాంగ్స్

ఈ చిత్రంలో బాలయ్య అభిమానులకు మంచి కిక్కు ఇచ్చేలా అదిరిపోయే మసాలా సాంగ్స్ కూడా ఉండనున్నాయి. అసలే పూరి సినిమాల్లో ఐటం సాంగ్స్ ఓ రేంజిలో ఉంటాయి. ఇక బాలయ్యతో సినిమా అంటే పూరి ఆ సాంగ్స్ ఎలా ప్రజంట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.


డాన్స్ స్టెప్స్ కేక

డాన్స్ స్టెప్స్ కేక

బాలయ్య ఈ సినిమాలో డాన్స్ పరంగా కూడా సరికొత్తగా కనిపించబోతున్నారు. ఇంతకు ముందు బాలయ్య సినిమాల్లో కనిపించిన రొటీన్ స్టెప్స్ కాకుండా ఇందులో కొత్తగా కంపోజ్ చేసిన స్టెప్స్ తో కనిపించబోతున్నారు.


క్రష్ ఎవ్రీవన్...

క్రష్ ఎవ్రీవన్...

మందేసిన మదపుటేనుగునురా.... క్రష్ ఎవ్రీవన్ అంటూ అంటూ బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ సినిమాపై అంచనాలు మరింత పెంచేలా చేసింది.


అభిమానులు కోరుకొనే అంశాలన్నీ పుష్కలంగా

అభిమానులు కోరుకొనే అంశాలన్నీ పుష్కలంగా

పూరి జగన్నాథ్ మాట్లాడుతూ - "నందమూరి బాలకృష్ణ తో కలిసి ఫస్ట్ టైమ్ ఈ సినిమా చేస్తున్నందుకు చాలా హ్యాపీ గానూ, గర్వం గానూ ఉంది. నా కెరీర్ లోనే ఇదొక మెమొరబుల్ మూవీ అవుతుంది. బాలకృష్ణ గారు ఈ పాత్ర లో లీనమైన తీరు చూసి వండర్ అయిపోయాను. నందమూరి అభిమానులు కోరుకొనే అంశాలన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయి. డైలాగ్స్, సాంగ్స్ అదిరిపోయే లెవెల్ లో ఉంటాయి. ఈ సినిమా ఎలా ఉండబోతోందో రేపు 28 న విడుదల కానున్న 'స్టంపర్' చూస్తే అర్థమవుతుంది. రెగ్యులర్ గా అందరూ విడుదల చేసే టీజర్ , ట్రైలర్ కి పూర్తి భిన్నం గా ఈ 'స్టంపర్' ఉంటుంది" అని చెప్పారు.


స్టంపర్

శ్రీయ , ముస్కాన్ , కైరా దత్, అలీ,పృథ్వి ,పవిత్రా లోకేష్ ,విక్రమ్ జిత్ తదితరులు నటించిన ఈ చిత్రం లో ప్రముఖ హాలీవుడ్ -బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ ఒక ప్రత్యేక పాత్ర ధరించారు . ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్.English summary
Watch Paisa Vasool official teaser “Stumper 101”. Paisa Vasool is a 2017 Telugu movie directed by Puri Jagannadh, starring Nandamuri Balakrishna, Shriya Saran, Muskan Sethi and Kyra Dutt in lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu