»   » ఈ నెల 28 న 'పైసా వసూల్' స్టంపర్ రిలీజ్

ఈ నెల 28 న 'పైసా వసూల్' స్టంపర్ రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ - పూరి జగన్నాథ్ ల సెన్సేషనల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'పైసా వసూల్'. భవ్య క్రియేషన్స్ పతాకం పై వి. ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం ప్యాచ్ వర్క్ జరుపుకుంటోంది. అది కూడా ఈ వారంలోనే పూర్తి కానుంది. ఈ నెల 28 న 'పైసా వసూల్' కి సంబంధించిన 'స్టంపర్' ని విడుదల చేయనున్నారు.

ఈ సందర్భం గా దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ - "నందమూరి బాలకృష్ణ తో కలిసి ఫస్ట్ టైమ్ ఈ సినిమా చేస్తున్నందుకు చాలా హ్యాపీ గానూ, గర్వం గానూ ఉంది. నా కెరీర్ లోనే ఇదొక మెమొరబుల్ మూవీ అవుతుంది. బాలకృష్ణ గారు ఈ పాత్ర లో లీనమైన తీరు చూసి వండర్ అయిపోయాను. నందమూరి అభిమానులు కోరుకొనే అంశాలన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయి. డైలాగ్స్, సాంగ్స్ అదిరిపోయే లెవెల్ లో ఉంటాయి. ఈ సినిమా ఎలా ఉండబోతోందో రేపు 28 న విడుదల కానున్న 'స్టంపర్' చూస్తే అర్థమవుతుంది. రెగ్యులర్ గా అందరూ విడుదల చేసే టీజర్, ట్రైలర్ కి పూర్తి భిన్నం గా ఈ 'స్టంపర్' ఉంటుంది" అని చెప్పారు.

Paisa Vasool stumper release on 28 July

నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ - " బాలకృష్ణ -పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ లో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు చాలా గర్వం గా ఫీల్ అవుతున్నాను. మా భవ్య క్రియేషన్స్ సంస్థ ప్రతిష్టను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సినిమా అవుతుంది. ఈ వారం తో ప్యాచ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి కావొచ్చాయి. మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ కూడా చురుగ్గా సాగుతూ, తుది దశకు చేరుకుంటోంది. ఆడియో ఫంక్షన్ ని త్వరలోనే గ్రాండ్ గా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఎన్.బి.కె. 101 ఫీవర్ బిగిన్స్ పేరుతో బాలకృష్ణ గారు ఇప్పటివరకూ నటించిన 100 సినిమాల విశేషాల తో ఒక వీడియో కర్టెన్ రైజర్ రిలీజ్ చేసాం. అది సోషల్ మీడియా లో ఇండియా లెవెల్ లో బాగా ట్రెండింగ్ అవుతోంది. " అని తెలిపారు.

Paisa Vasool stumper release on 28 July

శ్రీయ, ముస్కాన్, కైరా దత్, అలీ,పృథ్వి ,పవిత్రా లోకేష్ ,విక్రమ్ జిత్ తదితరులు నటించిన ఈ చిత్రం లో ప్రముఖ హాలీవుడ్ -బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ ఒక ప్రత్యేక పాత్ర ధరించారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్.

English summary
Paisa Vasool stumper release on 28 July. Paisa Vasool is a 2017 Telugu Action film, produced by V. Anand Prasad under Bhavya Creations banner and directed by Puri Jagannadh. Starring Nandamuri Balakrishna, Shriya Saran in the lead roles and music composed by Anup Rubens. Junaid Siddiqui, Mukesh G, and Johnny Shaik handled the editing, cinematography and Art direction respectively. Principal photography commenced in the March of 2017. The film is scheduled to release on 29 September 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu