»   » ‘పైసా వసూల్’ జోష్ : హీరోయిన్లతో కలిసి బాలయ్య దబ్బిడి దిబ్బిడి!

‘పైసా వసూల్’ జోష్ : హీరోయిన్లతో కలిసి బాలయ్య దబ్బిడి దిబ్బిడి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలయ్య హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పైసా వసూల్' ఆడియో రిలీజ్ వేడుక గురువారం సాయంత్రం ఖమ్మంలో జరుగుతోంది. ఆడియో వేడుకలో పాల్గొనేందుకు బాలయ్య సహా పైసా వసూల్ టీం ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుండి బయల్దేరి ఖమ్మం వెళ్లారు.

బాలయ్యతో పాటు హీరోయిన్ శ్రీయ, చార్మి, కైరా దత్.... బోయపాటి, క్రిష్, పూరి జగన్నాథ్, అలీ తదితరులు హెలికాప్టర్లో ఖమ్మం ఆడియో వేడుక వద్దకు బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా చార్మి తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా లైవ్ ఇచ్చింది.


హీరోయిన్లతో బాలయ్య దబ్బిడి దిబ్బిడి

హీరోయిన్లతో బాలయ్య దబ్బిడి దిబ్బిడి

హీరోయిన్లు చార్మి, శ్రీయలతో కలిసి బాలయ్య అభిమానులకు ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ, వారికి హాయ్ చెబుతూ సందడి సందడిగా కనిపించారు. చిత్ర యూనిట్ మొత్తం చాలా జోష్‌తో కనిపించారు.


అలీ

అలీ

ఈ సందర్భంగా తెగమగ అలీ.... పైసా వసూల్ దర్శక నిర్మాతలు, నటీనటులను సినిమా గురించి, బాలయ్యతో చేసిన ఎక్స్ పీరియన్స్ గురించి అడిగి తెలుసుకున్నారు.


జై బలయ్య కాదు... జై బాలయ్య

జై బలయ్య కాదు... జై బాలయ్య

ఐటం గర్ల్ హీరోయిన్ కైరా దత్ మాట్లాడుతూ, ‘హెలో ఎవ్రీవన్..దిస్ ఈజ్ కైరా దత్...నెక్స్ట్ మీ ఈజ్ జై బలయ్య' అని చెప్పింది. దీంతో, వెంటనే స్పందించిన అలీ..‘జై బలయ్య కాదు జై బాలయ్య' అని అనడంతో ‘ఓకే' అని కైరాదత్ సరి చేసుకుంది.


బాలయ్య హ్యాపీ హ్యాపీ

ఖమ్మంలో తన సినిమా ఆడియో వేడుక జరగడంపై బాలయ్య సంతోషం వ్యక్తం చేశారు. ఖమ్మంలో ఆడియో వేడుక నిర్వహించడం వెనక ప్రధాన కారణం.... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉంటున్న అభిమానులకు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ఇక్కడ ప్లాపన్ చేశారు.


English summary
Paisa Vasool team Grand Entry in Helicopter at Paisa Vasool Audio Launch Venue at Khammam.
Please Wait while comments are loading...