»   » పాక్ ఆర్టిస్టులు టెర్రరిస్టులు కాదు,సరైన వీసాతో పాక్ ఆర్టిస్టులరాకని స్వాగతిస్తున్నా : సల్మాన్ ఖాన్

పాక్ ఆర్టిస్టులు టెర్రరిస్టులు కాదు,సరైన వీసాతో పాక్ ఆర్టిస్టులరాకని స్వాగతిస్తున్నా : సల్మాన్ ఖాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఉరీ ఘటన విషయం లో భారత్ పాక్ రెండు దేశాల్లోనూ యుద్దవాతావరణం కమ్ముకోవటమే కాదు. భారత లో ఉన్న పాక్ కళాకారుల పట్ల కూడా కొన్ని సంస్థలనుంచి ఇబ్బందులు ఏర్పడ్డ విశయం తెలిసిందే. 48గంటల్లో మా దేశం వదిలివెళ్లండి లేదంటే చాలా తీవ్రపరిణామాలను ఎదుర్కొంటారని పాక్‌ నటులకు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అల్టిమేటం జారిచేసింది. యూరీ ఘటన నేపధ్యంలో స్పందించిన చిత్రపట్‌ కర్మచారి సేన పాకిస్తాన్‌ నటులను హెచ్చరించింది.

"పాకిస్థాన్ నటులు, ఆర్టిస్టులు భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడానికి 48 గంటలు సమయం ఇస్తున్నాం. ఒకవేళ వారు వెళ్లకపోతే ఎమ్మెన్నెస్ బయటకు గెంటేస్తుందని' చిత్రపట్ సేన సభ్యుడు అమేయ్ పేర్కొన్నారు. సినిమాకు, కళలకు తాము వ్యతిరేకం కాదని, పాకిస్థాన్ నటులకు మాత్రమే తాము వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. భారత ఛానెళ్లను పాకిస్థాన్ లో నిషేధించారని, బాలీవుడ్ తారల పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆయన తెలిపారు. అలాంటి పాక్ కళాకారుల సినిమాలు అడ్డుకుని తీరుతామని ఆయన తెలిపారు. దేశమే తమకు ముఖ్యమని, దేశం తరువాతే సినిమాలు, కళలు అని ఆయన స్పష్టం చేశారు.

కానీ ఈ విశయం లో బాలీవుడ్ నటులనుంచి మాత్రం వ్యతిరేకత వస్తిఓంది. కళకూ టెర్ర రిజానికీ ముడి పెట్టవద్దనీ. వారి తప్పులేనిదే అలా అనటం సరికాదనీ పలువురు బాలీవుడ్ నటులు బహిరంగ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. నిజానికి పాకిస్థాన్ కళాకారులకు వ్యతిరేకంగా శివసేన - ఎమ్మెన్నెస్ గతంలో పలుమార్లు హెచ్చరికలు జారీ చేసిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ కు చెందిన గజల్ గాయకుడు గులామ్ అలీ ఇటీవల ముంబైలో జరగాల్సిన తన ప్రదర్శనను రద్దు చేసుకున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వం తీరు కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని ఆ దేశ కళాకారులు ఆవేదన చెందుతున్నారు. నిజానికి పాకిస్థాన్ లో ప్రఖ్యాత కళాకారులకు ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. కానీ... ఇలాంటి సందర్భాల్లో వారికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.

Pak artists are not terrorists says Salman Khan

నటీనటులపై నిషేధం విధించాలన్న ఆలోచన చాలా చెడ్డ నిర్ణయమేనని బాలీవుడ్ నటి దీపికా కాకర్ అభిప్రాయపడింది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నంత మాత్రాన ఆర్టిస్టులపై ఇలాంటి చర్యలు తీసుకోవద్దని ఆమె సూచించింది. బుల్లితెరపై 'ససురాల్ సిమర్ కా'తో నటనకుగానూ ఆమె ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. మూవీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లను బ్యాన్ చేసినంత మాత్రాన సమస్యలు తొలగిపోవు కదా అని ఆమె అభిప్రాయ పడ్డారు. ఇలా నటుల మీద ద్వేశం సరైంది కాదనీ కళాకారులకు ప్రత్యక దేశం అంటూ ఉండదనీ, ఇలా చేయతం వల్ల ఏ సమస్యా పరిష్కారం అవదనీ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ కూడా స్పందించారు

అయితే ఇప్పుడు బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ వ్యాఖ్యలు ఈ వివాదం లో కీలకంగా మారాయి. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఆర్టిస్టులు టెర్రరిస్టులు కారనీ, వాళ్లను వెళ్లగొట్టాలి అనటం సరైంది కాదనీ సల్మాన్ చెప్పాడు. ఆర్టిస్టులు వేరూ టెర్రరిస్టులువేరు.., సరైన వీసా, వర్క్ ఒపర్మిట్లతో పాకిస్థానీ ఆర్టిస్టులు భారత్ రావలనే నేను కోరుకుంటునా అంటూ తన అభిప్రాయాన్ని చెప్పేసాడు ఈ బాలీవుడ్ దిగ్గజం. సెక్యులరిజాన్ని గౌరవించే సల్మాన్ ముస్లిం అయినా ప్రతీ యేటా గణేష్ నవరాత్రులనూ, దుర్గా పూజనూ ఘనం గా నిర్వహిస్తున్నాడు. ఈ విషయం లో ముస్లిం సంఘాలనుంచి ఫత్వాలు వచ్చినా లెక్క చేయలేదు. అయితే తాజా ఉదంతం పై సల్మాన్ మాతలకు ఎవరూ ఇప్పటివరకూ స్పందించలేదు.

English summary
Bollywood star Salman Khan backs Pakistani artists, says they are not terrorist and govt gives them visa, permit
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu