»   » మన సినిమా పాట... పాకిస్థాన్లో పాఠశాల గీతం!

మన సినిమా పాట... పాకిస్థాన్లో పాఠశాల గీతం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 1957లో రిలీజ్ అయిన 'దో ఆంఖే బారహ్‌ హాథ్‌' సినిమాలో లతా మంగేష్కర్‌ పాడిన 'యే మాలిక్‌ తేరే బందే హమ్‌' పాట అప్పట్లో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. మన దేశంలో మాత్రమే కాదు... దాయాది దేశం పాకిస్థాన్లోనూ ఈ పాట బాగా పాపులర్ అయింది.

పాకిస్థాన్ లోని ఓ పాఠశాల ఈ పాటలోని భావం నచ్చి దీన్ని తమ స్కూలు గీతంగా పిక్స్ చేసింది. రోజూ విద్యార్థులతో ప్రార్థనా గీతంగా ఈ పాట పాడిస్తున్నారట. ఇరు దేశాల మధ్య పస్థితులకు అతీతంగా... ఆ స్కూలు యాజమాన్యం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం హర్షనీయమే.

rn

లతాజీ సంతోషం

ఈ విషయం తెలిసి లతా మంగేష్కర్ కూడా సంతోషం వ్యక్తం చేసారు. తాను పాడిన పాటను స్కూల్ ప్రార్థనాగీతంగా ఆలపించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని లతా మంగేష్కర్ చెప్పుకొచ్చారు.

‘దో ఆంఖే బారహ్‌ హాథ్‌’

‘దో ఆంఖే బారహ్‌ హాథ్‌’

‘దో ఆంఖే బారహ్‌ హాథ్‌' సినిమాకు అప్పట్లో ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ ప్రాంతీయ చిత్రం (హిందీ) పురస్కారాలను సొంతం చేసుకుంది.

అంతర్జాతీయ అవార్డులు

అంతర్జాతీయ అవార్డులు

జాతీయ స్థాయిలో మాత్రమే కాదు... అంతర్జాతీయ స్థాయిలో కూడా పలు అవార్డులు సొంతం చేసుకుంది ఈచిత్రం. ప్రతిష్ఠాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారం అందుకున్న తొలి భారతీయ సినిమా కూడా ఇదే. బెర్లిన్‌ అంతర్జాతీయ చిత్రోత్సవంలో సిల్వర్‌ బేర్‌ పురస్కారం కూడా ఈ చిత్రానికి లభించింది.

వి.శాంతారామ్ దర్శకత్వంలో

వి.శాంతారామ్ దర్శకత్వంలో

వి.శాంతారామ్ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రంలో మొత్తం 5 పాటల ఉంటే... అన్ని పాటలను లతా మంగేష్కర్ తో పాండించారు. ఈ పాటను వసంత్ దేశాయ్ కంపోజ్ చేసారు.

English summary
Lata Mangeshkar's song "Ae malik tere bande hum" which was the original composition of Vasant Desai, was adapted by a Pakistani school as the school anthem.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu