twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాకిస్థాన్ సింగర్‌కు భారతీయ పౌరసత్వం మంజూరు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు, పాకిస్థాన్‌కు చెందిన అద్నాన్ సమీకి భారత పౌరతస్వం లభించింది. జనవరి 1, 2016 నుండి అతను భారత పౌరుడిగానే పరిగణించబడతాడు. ఈ మేరకు మినిస్ట్రీఆఫ్ హోమ్ అఫైర్స్ నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. భారత పౌరసత్వం కోసం అద్నాన్ సమీ పాకిస్థాన్ పౌరసత్వాన్ని వదులుకున్నారు.

    ఇండియన్ సిటిజెన్ ఆక్ట్ 1955 లోని సెక్షన్ 6 ప్రకారం అతనికి భారత పౌరసత్వం లభించింది. 2001 నుండి అద్నాన్ సమీ భారత్ లోనే నివాసం ఉంటున్నారు. చాలా ఏళ్ల క్రితమే అతను భారత పౌరసత్వం కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ మేరకు అటార్నీజనరల్ ఆఫ్ ఇండియా నుండి అతనికి పౌరసత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఒక సంగీత కళాకారుడిగా అతను భారతీయ సినీ పరిశ్రమకు చేస్తున్న సేవలకు కూడా అతనికి పౌరసత్వం లభించడానికి తోడ్పడ్డాయి.

    Adnan Sami

    2011లో ఇండియా వచ్చిన తర్వాత అద్నాన్ సమీ బాలీవుడ్ తో పాటు ఇతర భారతీయ బాషల్లోనూ ప్లేబ్యాక్ సింగర్ గా బిజీ అయ్యారు. హిందీతో పాటు, కన్నడ, తెలుగు, తమిళం, అస్సామీ, మళయాలం ఇలా అనేక భారతీయ బాషల్లో గాయకుడిగా తన ప్రతిభ కనరిచాడు.

    తెలుగులో ఆయన అనేక సినిమాల్లో పాటలు పాడారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలో ‘ఏ జిల్లా ఏజిల్లా...' పాటతో పాటు వర్షం, మహానంది, యోగి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, శంకర్ దాదా జిందాబాద్, జయీభవ, 100%లవ్, ఊసరవెల్లి, ఇష్క్, జులాయి, దేవుడు చేసిన మనుషులు, దేనికైనా రెడీ, గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం, టెంపర్ చిత్రాల్లో ఆయన పాటలు పాడారు.

    English summary
    Pakistani singer Adnan Sami has been granted Indian citizenship, Ministry of Home Affairs says. He will be a citizen of India from January 1 2016. The decision to grant Sami Indian citizenship was taken after he renounced his Pakistani citizenship.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X