»   » సుమంత్ మూవీలో హీరోయిన్‌‌గా టీవీ బ్యూటీ

సుమంత్ మూవీలో హీరోయిన్‌‌గా టీవీ బ్యూటీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని ఫ్యామిలీ నుండి నాగార్జున మేనల్లుడు సుమంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయినా స్టార్ హీరో రేంజికి ఎదగలేక పోయాడు. అయితే తనకు సూటయ్య సినిమాలు ఎంచుకుంటూ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆయన సినిమాలు కమర్షియల్ గా వర్కౌట్ కాక పోవడంతో అవకాశాలు తగ్గాయి.

దీంతో ఈ మధ్య చాలా గ్యాప్ తీసుకున్నాడు సుమంత్. ఎట్టకేలకు సుమంత్‌కు ఓ ప్రాజెక్టు ఓకే అయింది. బాలీవుడ్ హిట్ మూవీ ‘వికీ డోనర్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హిందీ వెర్షన్లో ఆయుష్మాన్ ఖురానా పోషించిన పాత్రను తెలుగులో సుమంత్‌తో చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 Pallavi Subhash confirmed for Sumanth’s next

ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకుడిగా పరిచయంకాబోతున్నారు. హిందీ టీవీ సీరియల్ నటి పల్లివి శుభాష్ అనే భామను హీరోయిన్ గా ఎంపిక చేసారు. పల్లవీ సుభాష్ మహాభారత్, చక్రవర్తి అశోక్ సమ్రాట్ వంటి సీరియల్స్ తో హిందీ టెలివిజన్ ప్రేక్షకులను మెప్పించింది ఈమె. ఇప్పుడు విక్కీ డోనర్ తెలుగు రీమేక్ తో టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తోంది.

తెలుగు నేటివిటీకి తగిన విధంగా స్క్రిప్టు సిద్ధమైనట్లు తెలుస్తోంది. జనవరి మొదటి వారంలో మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కాన్సెప్టు బాలీవుడ్లో సక్సెస్ అయింది కానీ... తెలుగులో ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది చర్చనీయాంశం అయింది.

English summary
Pallavi Subhash, the noted Hindi TV actress popular for her work in Chakravartin Ashoka Samrat and Mahabharat, has been roped in to play the female lead opposite Sumanth in hi next.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu