»   »  బ్లాక్ మనీ ఆరోపణలపై హీరోయిన్ ఐశ్వర్యరాయ్ స్పందన!

బ్లాక్ మనీ ఆరోపణలపై హీరోయిన్ ఐశ్వర్యరాయ్ స్పందన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విదేశాల్లో బ్లాక్‌మనీ కలిగి ఉన్నారంటూ విడుదలైన 500 మంది భారతీయుల లిస్టులో బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ పేర్లు కూడా ఉండటంతో అభిమానులు షాకయ్యారు. 'పనామా పేపర్స్' వివరాల ప్రకారం.. బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌లతో పాటు దేశంలోని కొందరు వ్యాపారవేత్తల పేర్లు ఉన్నాయి.

ఈ లిస్టులో తన పేరు ఉండటంపై ఐశ్వర్యరాయ్ స్పందించారు. పనామాలో తాను నల్లధనం దాచినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆమె స్పష్టం చేసారు. పనామా పత్రాల్లో ఉన్నట్లు చెబుతున్న సమాచారం పూర్తిగా అసత్యాలే అంటే ఆమె కొట్టిపారేసారు. ఈ మేరకు ఆమె మీడియా సలహాదారు ఈ విషయమై ప్రకటన చేసారు.

Panama Papers: Aishwarya Rai's Team Says Report 'Totally Untrue'

అయితే ఈ వార్తలపై అమితాబ్ బచ్చన్ మాత్రం స్పందించలేదు. బిగ్ బీ నాలుగు విదేశీ సంస్థల్లో డైరెక్టర్‌గా ఉన్నారని, ఈ కంపెనీలు ఐదువేల డాలర్ల నుంచి 50 వేల డాలర్ల మూలధనం నిల్వలను కలిగినప్పటికీ, మిలియన్ల విలువైన డీల్స్ చేశాయని పేర్కొంది.

76 దేశాలకు చెందిన 375 మంది జర్నలిస్టుల బృందం 'పనామా పేపర్స్' ప్రాజెక్టులో భాగస్వామ్యమై ప్రపంచ వ్యాప్తంగా నల్లధనం దాచుకున్న వారి వివరాలను వెల్లడించే దిశగా పరిశోధనలు సాగించింది. ఇప్పుడా వివరాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ టీంలో మన దేశంలోని 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' దినపత్రిక భాగమైంది.

English summary
Superstar Amitabh Bachchan and his daughter-in-law Aishwarya Rai are among celebrities who featured on Monday in a massive leak of documents, some of which reveal hidden offshore assets. The media adviser of Ms Rai, former Miss World and a hugely successful actor, has rejected the documents as "totally untrue and false".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu