»   » 'అస్ఖలిత బ్రహ్మచారి' అర్థం కోసం హన్సిక, ప్రణీత

'అస్ఖలిత బ్రహ్మచారి' అర్థం కోసం హన్సిక, ప్రణీత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పాండవులు పాండవులు తుమ్మెద చిత్రం గురించి మోహన్ బాబు వివరిస్తూ.... ''సినిమాలో ఒకచోట బ్రహ్మానందం 'మీరు పెళ్లి చేసుకోలేదా' అంటాడు. నేను 'అస్ఖలిత బ్రహ్మచారిని' అంటాను. సెట్లో ఉన్న చాలా మంది 'అస్ఖలిత' అంటే ఏమిటండీ అనడిగారు. దానికి అర్థమేమిటని హన్సిక కూడా అడిగింది. ప్రణీత అయితే బ్రహ్మానందం వద్దకెళ్లి 'మీరు కూడా అస్ఖలితేనా?' అనడిగింది'' వారికి ఏం చెప్పాలో నాకూ అర్థం కాలేదు అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు. చాలా కాలం తర్వాత ఆయన హీరోగా నటించిన చిత్రం 'పాండవులు పాండవులు తుమ్మెద' ఈ నెల 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

ఇక ఇప్పటిదాకా నేను ఎన్నో విలక్షణ పాత్రలు చేశా కానీ ఈ రకమైన పాత్ర ఇంతదాకా చేయలేదు. గమ్మత్తుగా ఉండే పాత్ర. విష్ణు రఫ్ అండ్ టఫ్‌గా ఓ మేన్లీ హీరోగా కనిపిస్తాడు. అలాగే ఇందులో నటించిన వాళ్లంతా తమ పాత్రల్ని అద్భుతంగా చేశారు. నేను, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీశ్ ఐదుగురు హీరోలం. మా పాత్రలేమిటన్నది సినిమా చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది. అత్యద్భుతమైన సినిమా తీశామన్న సంతృప్తి ఉంది.ఇందులో భార్యాభర్తల గురించీ, పిల్లల గురించీ అందమైన డైలాగులున్నాయి అన్నారు.

Pandavulu Pandavulu Tummeda

'దేనికైనా రెడీ', 'దూసుకెళ్తా' కంటే ఎక్కువ థియేటర్లలో దీన్ని విడుదల చేస్తున్నాం. దీన్ని రూ. 30 కోట్లు ఖర్చుపెట్టి తీశాను. రూ. 20 కోట్లకే బిజినెస్ ఆఫర్లు వచ్చాయి. ఎట్లా ఇస్తాను? అందుకే అది వద్దనుకుని ధైర్యంచేసి, సొంతంగా మేమే విడుదల చేస్తున్నాం. ఇదివరకు 'పెదరాయుడు'కు కూడా ఖర్చుపెట్టిన దానికంటే తక్కువ రేటుకు ఆఫర్లు వస్తే, అప్పుడు కూడా సొంతంగానే రిలీజ్ చేశాం. ఆ సినిమా ఫలితం ఏమిటో మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు దీనికి కూడా అదే జరుగుతోంది. అలా ఆ సెంటిమెంట్ కూడా వర్కవుట్ అవుతుందనుకుంటున్నా.

'పాండవులు పాండవులు తుమ్మెద' లో ఆయన ఇద్దరు కుమారులు విష్ణు, మనోజ్‌తో పాటు వరుణ్ సందేశ్, తనీశ్ హీరోలుగా నటించారు. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై విష్ణు, మనోజ్ సంయుక్తంగా నిర్మించగా, అరియాన, వివియాన సమర్పించారు. ఈ చిత్రానికి సంగీతం : కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్, కెమెరా : ఫలణికుమార్, పాటలు: చంద్రబోస్-భాస్కరభట్ల-అనంత శ్రీరామ్, మాటలు: డైమండ్ రత్న, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్-బివిఎస్ రవి-గోపీ మోహన్, పోరాటాలు: విజయ్, ఎడిటింగ్: ఎంఆర్ వర్మ, కళ: రఘు కులకర్ణి, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విజయ్ కుమార్.ఆర్, సమర్పణ: అవియానా-వివియానా, నిర్మాతలు : మంచు విష్ణువర్ధన్, మంచు మనోజ్, దర్శకత్వం: శ్రీవాస్.

English summary
Pandavulu Pandavulu Tummeda is slated for release on January 31 and its producers are also planning to release it on alternate distribution platforms such as video-on-demand (VOD), online and mobile platforms too. "There is a growing appetite for Indian films in the overseas market. Telugu films have a great potential to expand its market penetration in the international markets.
 
 
 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu