»   » ‘పాండవులు పాండవులు తుమ్మెద’ రీలీజ్ ఎప్పుడంటే?

‘పాండవులు పాండవులు తుమ్మెద’ రీలీజ్ ఎప్పుడంటే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు ఫ్యామిలీ మల్టీస్టారర్ చిత్రానికి 'పాండవులు పాండవులు తుమ్మెద' అనే టైటిల్ ఖరారైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియోను డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా సినిమాను సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రొడక్షన్ హౌస్ నుంచి అందిన సమాచారం.

శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్-24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై అరియానా-వివియానా సమర్పణలో మంచు విష్ణువర్ధన్-మనోజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ కథానాయకులుగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీ స్టారర్లో రవీనా టండన్, హన్సిక, ప్రణీత హీరోయిన్లు. 'లక్ష్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.

Pandavulu Pandavulu Thummedha

దాదాపు పది సంవత్సరాల అనంతరం మోహన్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కావడంతో 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టైటిల్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. బ్రహ్మానందం, ఎంఎస్.నారాయణ, అలీ, రఘుబాబు, గుర్లిన్ చోప్రా, అలేఖ్యవర్మ, తెలంగాణ శకుంతల, గిరిబాబు, పోసాని కృష్ణ మురళి, కాశీ విశ్వనథ్, కృష్ణ భగవాన్, సుప్రీత్, భరణి, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం : కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్, కెమెరా : ఫలణికుమార్, పాటలు: చంద్రబోస్-భాస్కరభట్ల-అనంత శ్రీరామ్, మాటలు: డైమండ్ రత్న, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్-బివిఎస్ రవి-గోపీ మోహన్, పోరాటాలు: విజయ్, ఎడిటింగ్: ఎంఆర్ వర్మ, కళ: రఘు కులకర్ణి, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విజయ్ కుమార్.ఆర్, సమర్పణ: అవియానా-వివియానా, నిర్మాతలు : మంచు విష్ణువర్ధన్, మంచు మనోజ్, దర్శకత్వం: శ్రీవాస్.

English summary
Manchu family multi starrer 'Pandavulu Pandavulu Thummedha' is going to release on January, 2914. The audio to be launched in a grand way in the first week of December.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu