»   »  "పనిలేని పులిరాజు" మోషన్ డైలాగ్ పోస్టర్ విడుదల

"పనిలేని పులిరాజు" మోషన్ డైలాగ్ పోస్టర్ విడుదల

Posted By:
Subscribe to Filmibeat Telugu

జబర్దస్త్ తో స్టార్ కమేడియన్ జబితాలో చేరిపోయిన ధన్ రాజ్ పదమూడు పాత్రల్లో నటిస్తున్న చిత్రం "పనిలేని పులిరాజు" దశావతారం లో కమల్ 10 పాత్రలలో కనిపిస్తే ఇప్పుడు ధన్ రాజ్ పదమూడు గెటప్ లలో కనిపించి మరో రికార్డు సృష్టించనున్నాడు. పూర్తి స్థాయి కామెడీ ఎంతర్ టైనర్ గా రూపొందు తున్న ఈ చిత్రం మోషన్ డైలాగ్ పోస్టర్ ను ఇంటర్నెట్లో విడుదల చేశారు.

పాలేపు మీడియా ప్రై.లి. పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు చాచా. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. చిత్రాన్ని జూన్ మూడోవారంలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా...

నిర్మాత పి.వి. నాగేష్ కుమార్ మాట్లాడుతూ ఈ సినిమా సెన్సార్ పూర్తయ్యింది. జూన్ మూడోవారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. పాటలు సినిమాలో హైలైట్ గా వుంటాయి. పాటలను మొదటి వారంలో విడుదల చేయనున్నాం అని అన్నారు.

Pani Leni Puliraju Motion Poster Released

సహ నిర్మాత రవి.కె.పున్నం మాట్లాడుతూ "ప్రస్తుతం మోషన్ పోస్టర్ విత్ డైలాగ్స్ విడుదల చేశాం. ఈ సినిమాలో డైలాగ్స్ కు ప్రాముఖ్యత వుంటుంది. రఘుబాబు కామెడీ, నటన సినిమాలో కడుపుబ్బా నవ్విస్తాయి" అన్నారు.
దర్శకుడు చాచా మాట్లాడుతూ "టీజర్ ను త్వరలోనే విడుదల చేస్తాం. ఇంతకు ముందు చెప్పినట్టు సినిమాలో హాస్యమే ప్రధానంగా వుంటుంది." అని అన్నారు.

ప్రాచిసిన్హా, శ్వేతావర్మ, ఇషా, హరిణి,రఘుబాబు, కొండవలస, కోటేశ్వరరావు, తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్ మరుకుర్తి, సంగీతం: వి.వి. సహ నిర్మాత: రవి.కె.పున్నం, సమర్పణ: పి. లక్షి, నిర్మాత: పి.వి. నాగేష్ కుమార్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: చాచా.

English summary
Jabardasth Dhana Dhan Dhana Raj Panileni Puli Raju Movie Motion released Today
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu