»   » చిన్న సినిమాలు చేయమని పవన్‌కళ్యాణ్ చెప్పారు

చిన్న సినిమాలు చేయమని పవన్‌కళ్యాణ్ చెప్పారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ''పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా చేయాలని పవన్‌కళ్యాణ్ చెప్పారు. అలాగే కొత్త కంటెంట్‌తో సినిమాలు తీయాలని కూడా సూచించారు. ఆ మాటలను స్ఫూర్తిగా తీసుకుని చేసిన చిత్రం ఇది'' అన్నారు నీలిమ తిరుమలశెట్టి. పవన్ తో తీసిన 'పంజా' తర్వాత ఆమె నిర్మించిన చిత్రం 'అలియాస్ జానకి'.

ఈ సినిమా ప్రచార చిత్రాన్ని (ట్రైలర్ ) ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. వెంకట్‌ రాహుల్‌ హీరో. అనీషా ఆంబ్రోస్‌, శ్రీరమ్య హీరోయిన్స్. నీలిమ తిరుమలశెట్టి నిర్మాత.

Alias Janaki

దర్శకుడు దయ.కె. మాట్లాడుతూ ''సామాజిక విలువలతో కూడిన చిత్రమిది. ఒక సామాన్యుడి ఆవేదనకి ప్రతిరూపంగా తెరకెక్కించాం. తప్పకుండా అందరినీ అలరిస్తుంది''అన్నారు.

కథ గురించి చెప్తూ...అతడి పేరు జానకిరామ్‌. పేరుకి తగ్గట్టే రాముడి లాంటి వ్యక్తి. ఎన్నో ఆశయాలతో పల్లెటూరి నుంచి పట్నంలో అడుగు పెడతాడు. అక్కడ కొన్ని ప్రతికూల శక్తుల నుంచి అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. ఈ పరిస్థితుల్లో మంచిని బతికించడం కోసం అతడు చేసిన యుద్ధమేమిటో తెరమీదే చూడాలంటున్నారు.

నీలిమ మాట్లాడుతూ- ''ఈ సినిమా ద్వారా చాలామంది కొత్త వారిని పరిచయం చేస్తున్నాం. 32 రోజుల్లో సినిమాని పూర్తి చేసేశాం. దయ అద్భుతంగా తెరకెక్కించారు. శ్రావణ్ మంచి పాటలిచ్చారు. వచ్చే వారంలో పాటలను, ఈ నెల మూడో వారంలో సినిమాని విడుదల చేస్తాం'' అని చెప్పారు.


హీరో రాహుల్ వెంకట్ మాట్లాడుతూ - ''ప్రస్తుతం ఆడవాళ్లపై ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. అలాంటి ఘోరాల్లో ఓ అంశాన్ని తీసుకుని చేసిన చిత్రం ఇది'' అన్నారు. ఈ చిత్రంలో నాగబాబు, తనికెళ్ల భరణి, శివన్నారాయణ, మీనాకుమారి తదితరులు నటించారు. ఛాయాగ్రహణం: సుజిత్‌ సారంగ్‌, సంగీతం: శ్రావణ్‌.

English summary

 Alias Janaki was shot in 32 days with pretty much all newcomers. Every one of them - artists and technicians have given their heart and soul to the movie !!! Although it's a small budget movie the technical standards will stand out.
 Pawan Kalyan garu inspired me to make content based movies and encourage new talent and I hope I have fulfilled my promise !!! Says producer Neelima Tirumalasetti.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu