»   » వినటానికి వింతగా ఉన్నా వర్క్ ఔట్ అయ్యేలానే ఉంది.... పవన్ కొత్త సినిమా టైటిల్

వినటానికి వింతగా ఉన్నా వర్క్ ఔట్ అయ్యేలానే ఉంది.... పవన్ కొత్త సినిమా టైటిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ 25వ సినిమాను డైరెక్ట్ చేస్తున్న త్రివిక్రమ్ మరోసారి అత్తారింటికి దారేది లాంటి మేజికల్ బాక్స్ ఆఫీస్ క్రియేట్ చేయడానికి అన్ని విధాలుగా కష్టపడుతున్నాడు. అత్తారింటికి దారేది సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకున్న అంశాలన్నింటినీ అంతకంటే ఎఫెక్టివ్‌గా ఇప్పుడు చేస్తున్న సినిమాలో కూడా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు త్రివిక్రమ్.

ఇంజినీరు బాబు

ఇంజినీరు బాబు

ముందుగా అనుకున్న 'దేవుడే దిగివస్తే' 'ఇంజినీరు బాబు' టైటిల్స్ మారిపోయి పవన్ పరదేశి గా మారిపోతున్నాడు. ఈ టైటిల్ పూర్తిగా త్రివిక్రమ్ కు నచ్చడంతో ఈ టైటిల్ ను ఫైనల్ చేసి పవన్ అంగీకారం కోసం ఎదురు చూస్తున్నట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ఏమైనా ఆఖరి నిముషంలో మార్పులు జరిగితే తప్ప 99 శాతం ఈ టైటిల్ ఫిక్స్ అని అంటున్నారు.

ఎంత ప్రభావం చూపుతుందో

ఎంత ప్రభావం చూపుతుందో

ఈ టైటిల్‌ పట్ల పవన్‌ కూడా సముఖత వ్యక్తం చేశాడట. అంతేకాకుండా ఈ టైటిల్‌ అభిమానులకు కూడా దగ్గరయ్యేలాగా ఉంది. టైటిల్‌ అనేది విడుదల తర్వాత ఎంత ప్రభావం చూపుతుందో మాటల మాంత్రికుడు బాగా అర్థం చేసుకుంటాడు కాబోలు అందుకే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యే టైటిల్‌లను ఫిక్స్‌ చేస్తాడు. ఈ చిత్రంలో పవన్‌ సరసన కీర్తి సురేష్‌, అనూ ఇమాన్యుయెల్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

పవన్‌ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా

పవన్‌ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా

పవన్‌కల్యాణ్ నటిస్తున్న 25వ చిత్రమిది కావడంతో టైటిల్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతున్నది. ఇందులో పవన్‌కల్యాణ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రానికి దేవుడే దిగివస్తే ఇంజనీర్ బాబు అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు వార్తలొచ్చాయి.

పరదేశి ప్రయాణం

పరదేశి ప్రయాణం

అయితే కథానుగుణంగా ఈ సినిమాకు పరదేశి ప్రయాణం అనే టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో దర్శకుడు త్రివిక్రమ్ వున్నట్లు చెబుతున్నారు. 'అత్తారింటికి దారేది' లోని కాటమరాయుడా కదిరి నరసింహుడా పాట ఉండే విధంగా అదేవిధమైన క్యాచీ ట్యూన్ తో సంగీత దర్శకుడు అనిరుధ్ చేత ఒక మంచి ఫోక్ ట్యూన్ ఉన్న ఒక ఫోక్ సాంగ్ ను త్రివిక్రమ్ ప్రత్యేకంగా కంపోజ్ చేయిస్తున్నట్లు టాక్.

రామోజీ ఫిలిం సిటీలో

రామోజీ ఫిలిం సిటీలో

ఈపాటను కూడ పవన్ చేత పాడిస్తారని తెలుస్తోంది.ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో ఈసినిమా కథకు సంబంధించి వచ్చే సాఫ్ట్ వేర్ కంపెనీ అందులో పవన్ ఉండే సీన్లు షూట్ చేస్తున్నారు. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈసినిమా ఎట్టి పరిస్తుతులలోను బ్లాక్ బస్టర్ హిట్ అయి తీరాలి అన్న ఉద్దేశ్యంతో 'అత్తారింటికి దారేది' సెంటిమెంట్లు అన్నీ త్రివిక్రమ్ రిపీట్ చేస్తున్నాడు అనుకోవాలి..

4 కోట్లతో ఆఫీసు సెట్

4 కోట్లతో ఆఫీసు సెట్

హాసిని అండ్ హారిక క్రియేషన్ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ 25వ సినిమాగా ముస్తాబవుతున్న ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఏకంగా జస్ట్ 4 కోట్లతో ఆఫీసు సెట్ వేసారు. సుమారు 100 కోట్ల బడ్జెట్ తో సినిమా తయారవుతోంది.

English summary
If the buzz from the film circles is to be believed, Paradesa Prayanam is under consideration as title for the most awaited Pawan kalyan's 25th Movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu