»   » త్రివిక్రమ్-పూరి దేవుళ్లు.... నన్ను గెంటేసేదాకా గీతాఆర్ట్స్‌లోనే!

త్రివిక్రమ్-పూరి దేవుళ్లు.... నన్ను గెంటేసేదాకా గీతాఆర్ట్స్‌లోనే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన హోమ్ బేనర్ గీతాఆర్ట్స్ లో నిర్మించిన చిత్రం 'శ్రీరస్తు శుభమస్తు'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. చాలా కాలం తర్వాత పరశురామ్ తన ఖాతాలో హిట్ వేసుకున్నాడు.

ఈ సినిమా విజయం సాధించడంతో గీతా ఆర్ట్స్ సంస్థలోనే మరో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు పరశురామ్. హీరోగా ఎంట్రీ ఇచ్చిన చాలా కాలం తర్వాత శిరీష్ తొలిసారి పూర్తి స్థాయి విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి, శిరీష్ లుక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా ఇంప్రూమెంట్ చూపడం వెనక పరశురామ్ కృషి చాలా ఉంది.


ఈ సినిమా ఇంత బాగా రావడానికి దర్శకుడు పరశురామ్ కారణమని అల్లు అరవింద్, బన్నీ తెగ పొగిడేస్తున్నారు. అంత పెద్ద వాళ్లు తనను పొగుడుతుంటే మిన్నకుండిపోతే ఏం బావుంటుందో ఏమో అనుకున్నాడో ఏమో..... పరశురామ్ కూడా వారికి దరవేయడం మొదలు పెట్టారు.


అయితే పొగడ్తలు గుప్పతించే క్రమంలో పరశురామ్ కాస్త ఓవర్‌గా రియాక్ట్ అయ్యారనే వాదన వినిపిస్తోంది. ''సినిమా హిట్టయి, లాభాలు వస్తే తప్ప ఒక దర్శకుడికి అదే సంస్థలో రెండో ఛాన్స్ వచ్చే అవకాశం లేని ఈ రోజుల్లో...అల్లు అరవింద్ గారు శ్రీరస్తు శుభమస్తు సినిమా విడుదలవ్వక ముందే నాకు మరో అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా తర్వాత వేరే సినిమాలు కమిట్ కావొద్దు. మనం బ్యానర్ లోనే ఇంకోటి చేద్దాం అని అరివింద్ గారు చెప్పడం నాకు చాలా పెద్ద వరం. నేను వెంటనే ఆయనకు రిప్లై ఇచ్చాను. సార్.. మీరు నన్ను మెడపట్టి బయటకు గెంటేసే వరకు నేను గీతా ఆర్ట్స్ ఆఫీస్ లోనే తిరుగుతూ ఉంటాను. ఎక్కడికీ వెళ్ళను అని చెప్పేసాను' అని పరశురామ్ తెలిపారు.


స్లైడ్ షోలో పరశురామ్ చెప్పిన మరిన్ని ఆసక్తికర విషయాలు..


కాస్త కాపీలా ఉందనే విమర్శలపై..

కాస్త కాపీలా ఉందనే విమర్శలపై..

దీనిపై పరశురామ్ స్పందిస్తూ..- ‘బొమ్మ‌రిల్లు ఎపిక్‌. నేను భాస్కర్ దగ్గర పని చేసాను. నా సినిమాను వాటితో పోలిస్తే అది నాకు గ్రేట్ ఫీలింగే‌. గురువుల ప్ర‌భావం మ‌న మీద ఎక్క‌డో ఉంటూనే ఉంటుంది క‌దా. చిరంజీవి కూడా ఈ సినిమాను బొమ్మ‌రిల్లుతో పోలిస్తే ఆనందంగా అనిపించింది. గురువుల పేరు నిలబెట్టడం అంటే గర్వకారణమే తప్ప త‌ల‌వంపు ఎలా అవుతుంది' అంటూ సమర్థించుకున్నారు.


దర్శకుడి పనిలో వేలు పెడతారనే విమర్శలపై..

దర్శకుడి పనిలో వేలు పెడతారనే విమర్శలపై..

గీతాఆర్ట్స్ సినిమా అంటే దర్శకుడి పనిలో అరవింద్, బన్నీ ఇలా చాలా మంది వేలు పెడతారనే విమర్శ ఉంది. దీనిపై పరశురామ్ స్పందిస్తూ...‘ఒక తండ్రి కొడుక్కు జాగ్రత్తలు చెబుతున్నాడంటే అది కొడుకు బాగు పడాలనే కదా. అరవింద్ గారు ఇచ్చే సలహాలు కూడా అలాంటివే' అంటూ సమర్థించుకున్నారు.


హీరోతో తొలినాళ్లలో పడలేదనే కామెంట్స్ మీద..

హీరోతో తొలినాళ్లలో పడలేదనే కామెంట్స్ మీద..

‘తొలి రెండు రోజులు నేను త‌న‌ని ఏమీ అన‌లేదు. కానీ త‌నే నా ద‌గ్గ‌ర‌కి వ‌చ్చి సార్ మీకు ఎలా కావాలో చెప్పండి. చేద్దాం. మ‌నం ఈ సినిమా చేస్తున్న పర్పసే వేరు, అర‌వింద్‌గారి కొడుకు అనే భావ‌నే వ‌ద్దు అని అన్నాడు. రాయ‌డానికి తీయ‌డానికి నేను క‌ష్ట‌ప‌డితే చేయ‌డం మాత్రం శిరీష్ చాలా బాగా క‌ష్ట‌ప‌డ్డాడు' అన్నారు పరశురాం.


శిరీష్ కోసమే..

శిరీష్ కోసమే..

ఈ సినిమా కథ రాసిందే శిరీష్ కోసం. త‌ను న‌న్ను న‌మ్మాడు. ముందు వేరే కథ అనుకున్నాం. ఓ సారి ఇద్దరం కలిసి ఉండగా సినిమా చేస్తే కెరీర్‌లో అలా ఉండిపోవాలి` అన్నాడు. అప్పుడు నేను మూడు వారాలు సమయం అడగాను. ఆలోచిస్తే ఓ పాయింట్ త‌ట్టింది. దాంతో ఈ కథని డెవలప్ చేసామని పరశురాం తెలిపారు.


వాళ్లు దేవుళ్లు...

వాళ్లు దేవుళ్లు...

డైలాగులు రాయడం అంటే త్రివిక్రమ్, పూరి తర్వాత మీరే అని అంతా అంటున్నారు కదా..? అనే ప్రశ్నకు స్పందిస్తూ...‘బాబ్బాబూ.. .అలాంటిదేమీ లేదండీ. వాళ్లు భ‌గ‌వంతులు. మ‌నం భ‌క్తులం అంతే' అంటూ తనది వాళ్ల స్థాయి కాదని స్పష్టం చేసారు.


లావణ్య త్రిపాఠి

లావణ్య త్రిపాఠి

లావణ్య త్రిపాఠిని తీసుకోవాలని నాకు శిరీష్ ప్ర‌పోజ్ చేశాడు. నేను బాగా చూపించాను అనడం కంటే ఆమె బాగా చేసింది అనడం మంచిది అన్నారు పరశురామ్.


టాప్ స్టార్ కాదు కదా..

టాప్ స్టార్ కాదు కదా..

సినిమా పాటలు తక్కువగా పెట్టడానికి కారణం...అవి పట్టే స్పేస్ లేక పోవడమే. దీంతో పాటు సినిమా థీమ్‌ని డిస్ట‌ర్బ్ చేయ‌కుండా ఉండాల‌ని వ‌దిలేశాం. శిరీష్ ఏమీ టాప్ స్టార్ కాదు. ఫ్యాన్స్ భారీగా ఉండే స్టార్స్ కు పాటలు అవసరం. ఎందుకంటే ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. శిరీష్ ఇప్పడే అభిమానులను ఏర్పరచుకునే ప్రాసెస్ లో ఉన్నాడు కాబట్టి పాట‌లు లేక‌పోయినా ఓకే ఫర్వాలేదనిపించింది అన్నారు పరశురామ్.


నన్ను గెంటేసేదాకా గీతాఆర్ట్స్‌లోనే!

దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన హోమ్ బేనర్ గీతాఆర్ట్స్ లో నిర్మించిన చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు'


English summary
Parasuram interview about Srirastu Shubhamastu movie. The movie written and directed by Parasuram. Which features Allu Shirish and Lavanya Tripati in the lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu