»   » పీరియడ్స్ గురించి మాట్లాడుకోవాలంటున్న పరిణీతి

పీరియడ్స్ గురించి మాట్లాడుకోవాలంటున్న పరిణీతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తన మనసులోని మాటలను దాపరికాలు లేకుండా బయటకు ధైర్యంగా చెప్పే భామల్లో బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ఒకరు. కొత్త విస్పర్ ఆల్ట్రాకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆమె తాజాగా ఆ ప్రొడక్ట్ లాచింగ్ కార్యక్రమంలో సంచనల కామెంట్స్ చేసారు. పీరియడ్స్ గురించి దాపరికాలు లేకుండా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

కట్టుబాట్ల ఉంటే ఒక చిన్న టౌన్ నుండి నేను వచ్చాను. కొన్ని అనవసరమైన కట్టుబాట్ల గురించి చైతన్యం తేవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మహిళల రుతుస్రావం(పీరియడ్స్) గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. కొన్ని అనవసర కట్టుబాట్లు కూడా ఉన్నాయి. మా గ్రాండ్ మదర్ కూడా నాకు ఇలాంటి కట్టుబాట్లు పెట్టేది.

Parineeti Chopra advices to start talking about Periods

పీరియడ్స్ సమయంలో పికిల్స్ ముట్టుకోవద్దు, ఆ సమయంలో గుడికి వెళ్లొద్దు, వంటగదిలోకి వెళ్లొద్దు, తలస్నానం చేయొద్దు లాంటి కట్టుబాట్లు పెట్టేది. 2016లో అలాంటి కట్టుబాట్ల మధ్య ఉండటం సాధ్యం కాదనేది నా భావన. మనం అభివృద్ధి చెందుతున్న, ఎడ్యుకేటెడ్ భారతదేశంలో ఉన్నాం. మహిళలు పీరియడ్స్ గురించి ఫ్రీగా మాట్లాడుకోవాలి. అప్పుడు వాటికి సంబంధించిన పరిష్కారాలు లభిస్తాయి అన్నారు.

గతంలో సెక్స్ గురించి సంచలన కామెంట్స్...
ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరికి వయసులో ఉన్నపుడు సెక్స్ కోరికలు ఉండటం సహజమే. ముఖ్యంగా యువతలో కోరికలు తారా స్థాయిలో ఉంటాయి. అలాంటపుడు సెక్స్ గురించి ఆలోచించడంలో తప్పేమీ లేదు. అయితే అతిగా ఆలోచిస్తే కొన్ని ఇబ్బందులు తప్పవు. సెక్స్ కోరికలు ఎక్కువైనపుడు ఏం చేయాలనేదానిపై బాలీవుడ్ హాట్ బ్యూటీ పరిణీతి చోప్రా తనదైన రీతిలో సమాధానం ఇచ్చింది. యువతరంలో సెక్స్ కోరికలు ఉండటం సహజమే. నాకు అలాంటి కోరికలు ఉంటాయి. యోగా, మెడిటేషన్ లాంటి వాటి ద్వారా నేను నా కోరికలను కంట్రోల్ లో ఉంచుకుంటున్నాను. మరీ ఎక్కువైనపుడు చన్నీటితో స్నానం చేస్తే సరిపోతుంది' అంటూ సలహా ఇచ్చింది.

English summary
Parineeti Chopra doesn't mind speaking out her heart irrespective of the topic or the platform. She made some sensitive comments during the launch of New Whisper Ultra which she has been endorsing.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu