»   » ఏం కోల్పోయామో తెలుస్తోంది:పరుచూరి బ్రదర్శ్

ఏం కోల్పోయామో తెలుస్తోంది:పరుచూరి బ్రదర్శ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మేం సాధించిన విజయాలు చూసి ఈ రోజు పొంగిపోతున్నామేమో. కానీ ఆలోచిస్తే ఏం కోల్పోయామో తెలుస్తుంది. రామకృష్ణ స్డూడియోస్‌లో కూర్చుంటే ఫలానా సంవత్సరంలో ఇక్కడ కూర్చుని ఫలానా డైలాగు రాశాం అని బాగానే గుర్తొస్తుంది. కానీ మా కుటుంబంతో గడిపిన జ్ఞాపకాలేం గుర్తుండవు అంటూ ఆవేదనతో చెప్తున్నారు పరుచూరి గోపాల కృష్ణ. టీఎస్సార్‌ లలితకళాపరిషత్తు పరుచూరి బ్రదర్స్ కి విశ్వవిఖ్యాత రచనాసార్వభౌములు అనే బిరుదుని ప్రదానం చేసిన సందర్భంగా వారు మీడియాతో ముచ్చటిస్తూ ఇలా స్పందించారు.

అదే విషయమై పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... మా ప్రస్ధానం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే సాగింది. నిజం ఓ నటుడు డైలాగు చెప్పి పక్కకెళ్లిపోతాడు. ఓ దర్శకుడి పని యాక్షన్‌తో మొదలై కట్‌తో అయిపోతుంది. రచయిత అలా కాదు రేపటి సన్నివేశం కోసం కుస్తీ పట్టాలి. ఈ 33 యేళ్లూ అదే చేశాం. చేస్తూనే ఉన్నాం. ఇంట్లో పరిస్థితి ఏమిటో ఏనాడూ కనుక్కోలేదు. పని ధ్యాసలో పడి పిల్లల చదువులు కూడా పట్టించుకోలేదు అన్నారు.

ప్రస్తుత తెలుగు సినిమా పరిస్ధితిని వివరిస్తూ... హీరో పాత్ర చిత్రణ ఆధారంగా కథలు అల్లేస్తున్నారు. నాలుగైదు సన్నివేశాలుంటే వెంటనే రంగంలోకి దిగిపోతున్నారు. మరి మిగిలిన సన్నివేశాల మాటేంటి? ఇలాగైతే సినిమా ఎక్కడ మొదలై ఎక్కడ ఆగుతుందో తెలీదు. కథ రాయడానికి ఓ రచయిత ఉంటాడనే సంగతి మరచిపోతున్నారు. డీవీడీల్లోంచి కథలు పుట్టేస్తున్నాయి అని చెప్పుకొచ్చారు.

English summary
In the Telugu cinema industry for a long time now, the name of writers Paruchuri Brothers- Venkateswara Rao, and Gopalakrishna is synonymous with success, entertainment and sharp political dialogues. With 333 films to their credit in a career spanning more than three decades, they are still going strong.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu