Just In
- 16 min ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 1 hr ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 2 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
- 2 hrs ago
ఆ సినిమా కోసం అలా.. ఇన్నాళ్లకు తెర ముందుకు బీ గోపాల్
Don't Miss!
- Sports
మిథాలీ రాజ్ హాఫ్ సెంచరీ.. అయినా తప్పని ఓటమి!
- Finance
బిట్‌కాయిన్ వ్యాల్యూ 4.2 శాతం జంప్, 50,948 డాలర్లకు..
- News
నేను అల్లాటప్పా పామును కాదు, కోబ్రాను! ఒక్క కాటు చాలు: మిథున్ చక్రవర్తి సంచలనం
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అలా చేసి ఉంటే సౌందర్య బ్రతికేది.. ఆమె మృతి వెనుక షాకింగ్ విషయాన్ని చెప్పిన పరుచూరి
టాలీవుడ్‌లోకి ప్రవేశించిన కొద్ది రోజులకే సౌందర్య అగ్రతారగానే కాకుండా అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకొన్నారు. స్టార్ హీరోల అందరితో కలిసి నటించిన ఆమె నటనతో ప్రేక్షకులను మెప్పించారు. గొప్ప నటిగా మారుతుందనే అందరూ ఊహిస్తున్న క్రమంలోనే హెలికాప్టర్ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. సౌందర్య గొప్పతనం గురించి పరుచూరి గోపాలకృష్ణ తన పరుచూరి పలుకులు వీడియో కార్యక్రమంలో మాట్లాడుతూ..

ఇప్పుడు సౌందర్య ఉంటే
చాలా రోజులుగా పరుచూరి పలుకులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. కానీ నాకు అత్యంత ఇష్టమైన స్వర్గీయ సౌందర్య గురించి చెప్పలేదే అనే బాధ కలిగింది. తాజాగా వెంకీమామ గురించి మాట్లాడుతున్న సౌందర్య పేరు పలకాల్సి రావడంతో ఆమె గురించి ఆలోచన నాలో కలిగింది. తాజా కొన్ని సినిమాలు చూస్తే ఆమె ఉంటే బాగుండేదేమో అనిపించింది. సౌందర్య 100కుపైగా సినిమాల్లో నటిస్తే మేము ఎనిమిది సినిమాలకు మాత్రమే మేము మాటలు రాశాం అని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.

సౌందర్యను చూసినప్పుడల్లా..
సౌందర్యను చూసినప్పుడల్లా నాకు ఇలాంటి భార్య ఉంటే బాగుండు అనే కంటే ఇలాంటి సోదరి ఉంటే బాగుంటుందనే ఫీలింగ్ అందరికీ కలిగేది. సావిత్రిని చూసినప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ కలగడం అరుదు. ఓ హీరోయిన్ చూసి చెల్లెలు అనే ఫీలింగ్ రావడం విశేషమే అని పరుచూరి పేర్కొన్నారు.

స్టార్ హీరోయిన్ అయినా..
1993లో సౌందర్యతో ఇన్స్‌పెక్టర్ ఝాన్సీతో మేము కలిసి పనిచేశాం. అప్పుడు ఆమెలో వినయం, పెద్దలకు ఇచ్చే గౌరవం చూసి పెద్ద స్టార్ అవుతుందని అనుకొన్నాం. అంతలోనే అమ్మోరుతో మంచి నటిగా పేరు తెచ్చుకొన్నది. మేము పనిచేసిన ఆజాద్ సినిమాలో ఆమెతో కలిసి పని చేశాం. సంవత్సరాలు గడిచి స్టార్ హీరోయిన్‌గా మారినా గానీ ఆమె వినయంలో మార్పు రాలేదు. కొంచెం కూడా గర్వం కనపించలేదు అని పరుచూరి తెలిపారు.

నాతో ఆసక్తికరమైన విషయం
ఆజాద్ సినిమా షూటింగ్‌లో మాకు సౌందర్య ఆసక్తికరమైన విషయం చెప్పారు. మా నాన్న కూడా మీలాగే సినీ రచయిత అని నాతో చెప్పడంతో షాక్ తిన్నాను. ఎందుకంటే ఓ రచయిత కూతురు ఇంత గొప్పగా ఎదిగింటే నాకు చాలా ఆనందం కలిగింది. ఆమె ఇప్పుడు ఉంటే, ఎన్ని అద్భుతమైన పాత్రలు చేసి ఉండే వారు. ఆమె అద్భుతమైన నటి అని పరుచూరి అన్నారు.

అద్భుతమైన సమయంలో విషాదం
సౌందర్యతో నాకు మరిచిపోలేని మెమొరీ ఉంది. ఏప్రిల్ 17, 2004లో నేను సాహిత్యంలో డాక్టరేట్ అందుకొనే రోజు. నా తల్లి కోరిక తీరబోతున్న సమయం. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాను. ఆ సమయంలో ఓ విలేఖరి నా వద్దకు వచ్చి విషాద సంఘటన అంటూ హెలికాప్టర్ క్రాష్ అంటూ వార్త చెప్పారు. ఆ ప్రమాదంలో సౌందర్య చనిపోయారని చెప్పగానే నా బాధ చెప్పలేనిది. నా తల్లి కోరుకొన్న కోరికను నెరవేర్చుకొంటున్న సమయంలో సౌందర్య విషాద వార్త వినడం తీరని లోటు అని పరుచూరి ఎమోషనల్ అయ్యారు.

సౌందర్య అలా చేసి ఉంటే బతికేది
సౌందర్య మరణం ఊహించలేనిది. వాస్తవానికి ఆమె విమానంలో రావాల్సింది. కానీ ఆప్తమిత్ర (నాగవల్లి తెలుగులో) షూటింగ్ కారణంగా విమానం మిస్ అయింది. అందుచేత హెలికాప్టర్‌లో బయలు దేరారు. ఒకవేళ విమానంలో వచ్చి ఉంటే ఓ అద్భుత నటి మన నుంచి దూరం అయ్యేది కాదు. ఆమె లేని లోటు నిజంగా పూడ్చలేనిది అంటూ పరుచూరి అన్నారు.