twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్నట్లు: ఆ రెండు.. పార్వతి నాయర్ అలా ఎలా వదులుకుంది?

    |

    కొన్ని కథలు వినడానికి చాలా సాదాసీదాగా ఉంటాయి. కానీ తెరకెక్కించాక చూస్తే అద్భతమనిపిస్తాయి. కాబట్టి కథలు విన్నంత మాత్రాన్నే దాన్ని జడ్జ్ చేయడం కూడా కష్టమే. ఎందుకంటే.. దర్శకుడు దాన్ని చూపించబోయే దృష్టి కోణం వేరుగా ఉండవచ్చు. విన్నవాళ్ల ఇమేజినేషన్ మరోలా ఉండవచ్చు. ఇలాగే కథను సరిగ్గా జడ్జ్ చేయలేక రెండు లక్కీ ఛాన్స్ లు మిస్ అయింది మలయాళీ హీరోయిన్ పార్వతీ నాయర్. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించడం గమనార్హం.

     'అర్జున్ రెడ్డి' కోసం అడిగితే..:

    'అర్జున్ రెడ్డి' కోసం అడిగితే..:

    అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం దర్శకుడు సందీప్ వంగా తొలుత హీరోయిన్ పార్వతి నాయర్ నే సంప్రదించారట. అయితే సినిమాలో లిప్ టు లిప్ కిస్సింగ్ సీన్స్ ఎక్కువగా ఉండటం.. అదీగాక క్యారెక్టర్ బోల్డుగా ఉండటంతో పార్వతి 'నో' చెప్పేసిందట.

     ఆ అనుమానం కూడా:

    ఆ అనుమానం కూడా:

    బోల్డ్ నెస్‌కు తోడు కథను సరిగా జడ్జ్ చేయలేకపోయానని పార్వతి పరోక్షంగా చెప్పింది. దర్శకుడు కథ చెప్పినప్పుడు అంత ఎగ్జయిటింగ్ ఏమి అనిపించలేదట. పైగా కొత్త దర్శకుడు కదా.. ఎలా తీస్తాడో అన్న అనుమానంతోనూ ప్రాజెక్ట్ ఒప్పుకోలేదట.

    'అరువి' కూడా మిస్:

    'అరువి' కూడా మిస్:

    అర్జున్ రెడ్డి ఒక్కటే కాదు.. తమిళంలో వచ్చిన 'అరువి' అవకాశాన్ని కూడా ఇలాగే వదులుకుందట పార్వతి. ఈ సినిమా తమిళనాట సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఎయిడ్స్ పేషెంట్ పాత్రలో హీరోయిన్ అదితి బాలన్ పాత్రకు విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు కూడా వరించాయి.

    Recommended Video

    'Bloody Bold Movie' Ram charan Says About 'Arjun Reddy'
     చేతులు కాలాక..:

    చేతులు కాలాక..:

    అర్జున్ రెడ్డి.. అరువి.. ఈ రెండు కథల్ని రిజెక్ట్ చేసిన పార్వతి నాయర్.. ఆ తర్వాత వాటిని తెరపై చూశాక మాత్రం తెగ పీలైందట. కథల్ని తక్కువ అంచనా వేసి తప్పులో కాలేశానని అనుకుందట.

    ఈ రెండు సినిమాలు చేసి ఉంటే గనుక పార్వతి నాయర్ కెరీర్ మరోలా ఉండేదేమో!. కానీ బ్యాడ్ లక్.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం. ప్రస్తుతం తెలుగులో అడవి శేష్‌ సినిమాలో నటించేందుకు పార్వతి నాయర్ కమిట్ అయింది.

    English summary
    Malayali Heroine Parvati Nair missed two golden opportunities because of wrong judgement on stories. Those are Arjun Reddy and Aruvi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X