»   » తాత గుర్తొచ్చేలా...‘పటాస్’ కాంబినేషన్ రెండోసారి

తాత గుర్తొచ్చేలా...‘పటాస్’ కాంబినేషన్ రెండోసారి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘పటాస్' మూవీ విజయవంతం అయిన నేపథ్యంలో హీరో కళ్యాణ్ రామ్ - దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు. ‘పటాస్' సినిమాను కళ్యాణ్ రామే స్వయంగా నిర్మించారు. సినిమా ఇచ్చిన విజయోత్సాహంతో అనిల్‌తో మరో సినిమా చేయడానికి కళ్యాణ్ రామ్ ఆసక్తి చూపుతున్నారు

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ విసయం గురించి కళ్యాణ్ రామ్ వివరిస్తూ ‘మా బ్యానర్ లో నేను అనిల్ కలిసి మళ్లీ తప్పక సినిమా చేస్తాం. అయితే అది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. తప్పకుండా తాత గారి సినిమాలను తలపించే సినిమా అవుతుంది. డిఫరెంటుగా ఉంటుంది' అని తెలిపారు.


Pataas combination will repeat

పటాస్ సినిమా విషయానికొస్తే సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెలుతోంది. సినిమా టాక్ బావుండటంతో కలెక్షన్లు బాగా వస్తున్నాయి. ప్రేక్షకుల తాకిడి పెరగడంతో థియేటర్ల సంఖ్యను కూడా బాగా పెంచారు. ఈ సినిమా విజయం దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్‌కి బూస్ట్ ఇచ్చినట్లయింది.


అనిల్ రావిపూడికి పలువురు నిర్మాతలు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారట. నెక్ట్స్ సినిమా తమతో అంటే తమతో చేయాలని కోరుతున్నారట. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అర్జున్ నుండి అతనికి ఆఫర్ వచ్చిందని సమాచారం.


మరికొందరు స్టార్స్ కూడా ఆయనతో చేయడానికి ఆసక్తి చూపుతున్నారట. మొత్తానికి ‘పటాస్' విజయంతో ఓవర్ నైట్ స్టార్ అయింది మాత్రం దర్శకుడు అనిల్ రావిపూడి అని చెప్పక తప్పదు. మరి తొలి విజయం ద్వారా ఆయనకు వచ్చిన స్టార్ స్టేటస్‌ను భవిష్యత్తులో ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.

English summary
Actor Kalyan Ram interest to do another movie with director Anil Ravipudi.
Please Wait while comments are loading...