»   » 'సర్ధార్' షాక్ : టిక్కెట్ కోసం ఇల్లు అమ్మేసాడు, పవన్ కు తెలుసా?

'సర్ధార్' షాక్ : టిక్కెట్ కోసం ఇల్లు అమ్మేసాడు, పవన్ కు తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ సినిమా వస్తోందంటే ఎంత రేటు పెట్టి కొనైనా మొదటి రోజు చూడాలనుకుంటారు అభిమానులు. అది రెగ్యులర్ గా జరిగే విషయమే. అయితే ఇల్లు, పొలం అమ్మి ఎప్పుడూ సినిమా టిక్కెట్లు కొనటం మాత్రం జరగలేదు. ఇప్పుడు కర్నాలులో ఓ అభిమాని ఇల్లు అమ్మేసి అందరికీ షాక్ ఇచ్చారు.

అందుతున్న సమాచారం ప్రకారం.. సర్ధార్ గబ్బర్ సింగ్' చిత్రం ఈ నెల 8న విడుదల కాబోతుండగా, కర్నూల్‌ జిల్లాలో ఓ అభిమాని తన అభిమాన హీరో సినిమాకోసం 10 లక్షల ఇల్లు అమ్మేసి టిక్కెట్లు కొన్నాడట. ఇది విన్న తోటి అభిమానులు షాక్ అవుతున్నారు. మరి ఈ విషయం పవన్ దగ్గరకు చేరిందో లేదో కానీ. మీడియా మాత్రం ఓ రేంజిలో పబ్లిసిటీ ఇస్తోంది.


Pavan Kalyan Fan Sells His Home For Sardaar Gabbar

ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 8న విడుదల కానున్న ఈ సినిమా సందడి ఇప్పటికే మొదలై జోరుగా సాగుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలాచోట్ల ఓ రేంజ్‌లో నడుస్తున్నాయి. ఇక సినిమాకు ఈ స్థాయి క్రేజ్ ఉన్న నేపథ్యంలో థియేటర్ యాజమాన్యాలు కూడా టికెట్ ధరను పెంచే ప్రయత్నాలు మొదలెట్టి, ఫర్మిషన్ కోసం తిరుగుతున్నాయి.ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలాప్రాంతాల్లో టికెట్ ధర పెంపు కోసం థియేటర్ యాజమాన్యాలు అప్లికేషన్స్ పెట్టుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. కృష్ణా జిల్లాలో టికెట్ ధర పెంపు కోసం అన్ని థియేటర్ల నుంచి అప్లికేషన్స్ వెళ్ళినట్లు సమాచారం. ఇక బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శరత్ మరార్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. పవన్ కళ్యాణ్ సరసన కాజల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు.

English summary
Pavan Kalyan Fan from Kurnool District Sells his house for sardaar gabbar singh movie tickets.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu