»   » అన్నకోసం తమ్ముడి సెట్... మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు జనం ఊహలేనా..??

అన్నకోసం తమ్ముడి సెట్... మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు జనం ఊహలేనా..??

Posted By:
Subscribe to Filmibeat Telugu

బ్రదర్స్ చిరు, పవన్ కళ్యాణ్ ల మధ్య బిగ్ ఫైట్ నడుస్తుందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల మెగా ఫ్యామిలీ జరుపుకున్న దీవాళి సెలబ్రేషన్స్ కి పవన్ హాజరు కాకపోవడం అగ్గికి ఆజ్యం పోసినట్టే అయిందని కొందరు గాసిప్ రాయుళ్లు చెబుతున్నారు. గతంలో ఎన్నో సార్లు వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చిన అవన్నీ అసత్యాలు అని అనేక సార్లు ప్రూవ్ చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకు పెద్ద సాయమే చేశాడని తెలుస్తోంది.

కాటమరాయుడు కోసం ఓ మాంచి సెట్ వేసారు. ఇప్పుడు అదే సెట్ ను ఈరోజు నుంచి ఖైదీ నెం 150 సినిమా కోసం వాడుతున్నారు. రెండు మూడు రోజుల పాటు ఇదే సెట్ లో షూటింగ్ కొనసాగుతుందని తెలుస్తోంది. ఖైదీ నెంబర్ 150 సినిమాను సంక్రాంతి విడుదలకు టార్గెట్ చేసి రూపొందిస్తున్నారు. చిత్రం చివరి దశకు చేరుకోగా చిరంజీవి కాంబినేషన్ లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించవలసి ఉందట.

pavan kalyan helps his brother Megastar chiranjeevi

దీని కోసం ప్రత్యేక మైన సెట్ వేయాలని భావించిందట యూనిట్. ఇప్పటికిప్పుడు రెండు మూడు రోజుల షూట్ కోసం సెట్ వేయాలి అంటే కాస్త టైమ్ పడుతుంది. అంతే కాదు రెండు మూడు రోజుల్లో పూర్తయ్యే షూటింగ్ కోసం అంత ఖర్చు పెట్టడం ఎందుకా అని చిరు ఆలోచనలో పడ్డాడట. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తాను చేస్తున్న కాటమరాయుడు సెట్ ని వాడుకోమని చెప్పాడట. దీంతో నిన్నటి నుండి చిరు చిత్ర షూటింగ్ పవన్ మూవీ సెట్ లో జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు 'కాటమరాయుడు' చిత్రానికి వేసిన సెట్ లో 'ఖైదీ నెం.150' షూటింగ్ జరగనుంది. 'ఖైదీ నెం.150' కోసం ఓ సెట్ వేయాలని ప్లాన్ చేసారట. కానీ పవన్ కళ్యాణ్ చెప్పడంతో సెట్ వేయకుండా 'కాటమరాయుడు' సెట్ ని వాడుకుంటున్నారట. అన్నయ్య ప్రతిష్టాత్మక చిత్రం 'ఖైదీ నెం.150' సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని తమ్ముడు పవన్ కళ్యాణ్ పట్టించుకుంటున్నాడనే వార్తలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సలహా మేరకు కాజల్ అగర్వాల్ ని, అలీని తీసుకోవడంతో పాటు కొన్ని కీలక సన్నివేశాలకు డైలాగ్స్ రాయడానికి బుర్రా సాయిమాధవ్ ని తీసుకున్నారని సమాచారమ్. సో...! రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నప్పటికీ, పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి సంబంధించి ప్రతి విషయంలోనూ కేర్ తీసుకుంటున్నాడని దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు.

pavan kalyan helps his brother Megastar chiranjeevi

రెండు మూడు రోజుల్లో ఖైదీ నెంబర్ 150 చిత్రీకరణ పూర్తి కానుండగా, డిసెంబర్ లో చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ ని పూర్తి చేసి సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలనేది యూనిట్ ప్లాన్ అట. ఇక పవన్ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోండగా ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఏదైమన అన్నయ్యకు తమ్ముడు చేసిన ఈ సాయం మెగా అభిమానుల ఆనందం అవధులు దాటేలా చేసింది.

English summary
Pawan kalyan helps his brother Megastar chiranjeevi To shoot khaidi no 150 patch up scenes in katamarayudu sets
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu