»   » 'చిరు – పవన్' మల్టీ స్టారర్ విషయమై పవన్ షాకింగ్ రిప్లై

'చిరు – పవన్' మల్టీ స్టారర్ విషయమై పవన్ షాకింగ్ రిప్లై

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గత కొద్దిరోజులుగా మీడియాలో ఓ రేంజిలో హల్ చల్ చేసిన వార్త ఏమిటీ అంటే ..చిరంజీవి, పవన్ మల్టీస్టారర్ చేయబోతున్నారని. రీసెంట్ గా ...ఖైదీ నంబర్ 150 సినిమా సందర్భంగా మెగాస్టార్ కోసం కళాబంధు సుబ్బిరామి రెడ్డి, ఓ గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో త్వరలో మెగా ఫ్యామిలీ హీరోలతో ఓ మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు సుబ్బిరామి రెడ్డి.

అయితే ఇంత భారీ కాంబినేషన్ సెట్ అవ్వడానికి చాలా సమయం పడుతుందని భావించారు ఫ్యాన్స్. కానీ అతి త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో ఓ సినిమా పట్టాలెక్కనుందని మళ్లీ మీడియా లో వార్తలు వచ్చారు.

అంతేకాకుండా సుబ్బిరామిరెడ్డితో పాటు అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నాడని చెప్పుకున్నారు. కొంత కాలంగా మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ దూరమవుతున్నాడన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో చిరు, పవన్ లు కలిసి ఒకే సినిమాలోనటిస్తున్నారన్న వార్త అభిమానులను ఖుషీ చేసింది. ఈ నేపధ్యంలో పవన్ ఈ విషయమై మాట్లాడారు.

Pawan about Chiru,Pawan Multistarar

తాజాగా యూఎస్ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ ని మీడియా వారు... మీరు మీ అన్నయ్యతో కలిసి సినిమా చేస్తున్నారా అనే ప్రశ్న వేసారు. దానికి పవన్ నవ్వుతూనే అలాంటి ప్రస్తావనేదీ నా దగ్గరకు రాలేదు అని సమాధానమిచ్చి షాక్ ఇచ్చారు. పవన్ చెప్పిన ఈ సమాధానంతో మెగా ఫ్యాన్స్ అసలు లేనట్లే అని అర్దమవుతోంది. అంటే సుబ్బిరామిరెడ్డి సరదాగా ఓ మాట వేసి, వార్తల్లో నిలిచారు అంతే అన్నమాట.

ఇక పవన్ తన స్పీచ్ తో అక్కడి వారిని ఆకట్టుకున్నారు.. " నేను పెద్దగా చదువుకోలేదు. డ్రాపవుట్ ను కూడా. కానీ జీవితాన్ని సమాజాన్ని చదవడంలో నేను నిత్య విద్యార్థినే. చిన్నప్పటి నుంచీ సమాజం తీరు తెన్నులనే గమనించేవాడిని. అనుకోకుండా నటుడినయ్యాను. మీ ఆదరణతో విజయవంతంగా నిలిచాను. నా వరకు నాకు బాగానే ఉంది. కానీ సమాజ పరిస్థితులు చూసి... సౌకర్యంగా ఉండలేకపోయాను. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపగలిగినప్పుడే నాకు రిలీఫ్ లభించినట్లు భావిస్తాను. నా ప్రతిష్ఠకు కారణమైన ఈ సమాజానికి మేలు చేయాలన్న తలంపుతోనే 'జనసేన'ను స్థాపించాం.

జనసేన వద్ద తుపాకులుండవు. గుండె ధైర్యమే మా ఆయుధం. ఏం పోయినా లెక్క చేయను. కానీ ధైర్యాన్ని మాత్రం కోల్పోను. ధైర్యే సాహసే లక్ష్మీ...ధైర్యం ఉంటే అన్నీ వస్తాయి. ఎన్నో వేలమంది మహానుభావుల నిస్వార్థ పోరాటం బలిదానాల వల్ల మనం ఈరోజు స్వాతంత్ర్యం తాలూకు స్వేచ్ఛను అనుభవిస్తున్నాం. వారందరికీ మనం రుణపడి ఉంటాం. జాతీయ సమగ్రత మన లక్ష్యం.

భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం ప్రత్యేకత. భౌగోళికంగా సరిహద్దులుండవచ్చేమో కానీ భారతీయులంతా ఒక్కటే అనే భావన గొప్పది. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అలా లేవు. సమాజాన్ని విభజించేవిగా మారిపోతున్నాయి. ప్రజలు ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలను ఆదిలోనే పరిష్కరించకపోతే అవి విపత్తులా మారిపోతాయి.

మన దేశ రాజకీయ నాయకులు దీన్ని గుర్తించడంలేదు. సమస్య పెద్దగా మారిపోయాక కూడా స్పందించడంలేదు. తెలంగాణ సమస్యే దీనికి నిదర్శనం. 30 ఏళ్లకు పైగా ఈ సమస్యను పట్టించుకోని స్థితిలో ఎంతో మూల్యం చెల్లించాల్సి వచ్చింది" అని పవన్ విశ్లేషించారు.

English summary
When questioned in America about Pawan teaming up with his brother Chiru, Pawan Kalyan said, "I haven't got any proposal such."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu