»   » 'సార్'అని పిలిస్తే పవన్ ఒప్పుకోలేదంటోంది

'సార్'అని పిలిస్తే పవన్ ఒప్పుకోలేదంటోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

తనని సార్ అని పిలవొద్దన్నాడని,తాము కొలిగ్స్ మంటూ పవన్ కళ్యాణ్ అని చాలా గౌరవంగా బిహేవ్ చేసాడని చెప్తోంది సారా జేన్‌ డయాస్‌.ఆమె తాజాగా పవన్,విష్ణు వర్ధన్ కాంబినేషన్ లో రూపొందుతోన్న షాడో చిత్రంలో చేస్తోంది.ఆమెను పవన్ తో ఎక్సపీరియన్స్ గురించి చెప్పమని మీడియా వారు అడిగినప్పుడు ఇలా స్పందించింది. అలాగే తను ఈ పాత్ర ఒప్పుకోవటానికి కారణం పవన్ కళ్యాణ్, దర్శకుడు విష్ణు వర్దన్ అని, వారిద్దరు పట్టుదల వల్లే తాను ఓకే చేసానని చెప్పింది. ఇక తనకు తెలుగు రాదని, అయితే ఇప్పుడు నేర్చుకునే పనిలో ఉన్నానని, తెలుగు సినిమాలు ముఖ్యంగా పవన్ చేసినవి చూస్తున్నానని, చాలా బాగున్నాయని చెప్పుకొచ్చింది.

సంఘమిత్ర ఆర్ట్స్‌, ఆర్కా మీడియా వర్క్స్‌ ప్రై.లిమిటెడ్‌ ఆధ్వర్యంలో తిరుమలశెట్టి నీలిమ, శోభు యార్లగడ్డ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్‌ సరసన సారా జేన్‌ డయాస్‌, అంజలీ లావానియా నటిస్తున్నారు.ఈ చిత్రం గురించి దర్శకుడు విష్ణువర్ధన్‌ మాట్లాడుతూ...'ఆద్యంతం ఆసక్తికరంగా నడిచే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. పవన్‌ అభిమానులను ఆకట్టుకునే అంశాలతో సినిమా చాలా స్టెయిలిష్‌గా ఉంటుంది' అన్నారు. జాకీష్రాఫ్, అడవి శేష్, అతుల్ కులకర్ణి, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అలీ, సుబ్బరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాహుల్ కోడా, కెమెరా .ఎస్.వినోద్, కూర్పు ఎ.శ్రీకర్‌ప్రసాద్, ఫైట్స్ శ్యామ్ కౌశల్, కళ సునీల్ ‌బాబు.

English summary
"I thoroughly enjoyed working with Pawan Kalyan. Initially, I addressed him as 'Sir', because I was a bit awe of him. But, he asked me to stop it. Even Today, we laugh about it," said Sarah Jane Dias.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu