»   » పవన్.. ఛేగువేరా(ఫోటో)

పవన్.. ఛేగువేరా(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో యువతకు స్ఫూర్తినిచ్చే చేగువేరా ఫొటోలను తన సినిమాల్లోనే కాకుండా, తన కొత్త పార్టీ ఆవిర్భావ మీటింగులలో పవన్‌ కళ్యాణ్‌ ప్రదర్శించారు. ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో పవన్ కళ్యాణ్ ఆహార్యం ను,మాట్లాడే విధానాన్ని ఛేగువేరా తో పోలుస్తూ, ప్రస్తావిస్తూ ఫోటోలు పెడుతున్నారు. ఇండియన్ ఛేగువేరా అన్నట్లు పవన్ ని అభిమానులు ప్రొజెక్టు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో ...ఫేస్ బుక్ ,ట్విట్టర్ లలో విపరీతంగా సర్కులేట్ అవుతూ అభిమానులను అలరిస్తోంది. ఈ విధంగా ఛేగువేరా వంటి మహా నాయుకుడుని చాలా మంది ఇప్పటికే తెలుసుకోనివారు తెలుసుకోవటానకి ప్రయత్నించటం జరుగుతోంది. అయితే మరోప్రక్క ఈ ఫోటోపై విమర్శలు కురుస్తున్నాయి.

ఇక విశాఖ నగరంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో గురువారం జరగనున్న జనసేన పార్టీ బహిరంగ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పవన్ కల్యాణ్ పార్టీ ప్రకటించిన తరువాత జరుగుతున్న మొట్టమొదటి సభ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పవన్ ఈ సభలో ఏమీ మాట్లాడబోతున్నారో.. ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఎటువంటి ప్రకటన చేస్తారోనని అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. సభను విజయవంతం చేసే బాధ్యతను అభిమానులు భుజాన వేసుకున్నారు.

Pawan and Cheguvera photos


మున్సిపల్ స్టేడియంలో భారీ వేదిక ఏర్పాటు దాదాపు పూర్తికావొచ్చింది. సభకు వచ్చే మహిళల కోసం ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. గురువారం ఉదయం విశాఖ చేరుకోనున్న పవన్ కల్యాణ్‌కు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు సిద్ధమవున్నారు. సీమాంధ్రలోని వివిధ జిల్లాల నుంచి భారీగా అభిమానులు పవన్ సభకు తరలిరానున్నారని పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్ తెలిపింది.

ఇక 'జనసేన' పార్టీకి సంబంధించిన భారీ బహిరంగ సభ ఈ నెల 27వ తేదీన విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగబోతున్న సంగతి తెలిసిందే. ఈ సభను ప్రజలు, అభిమానులు భారీగా తరలి రావాలని పవన్ కళ్యాణ్ ఫోటోతో కూడి పోస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా వెలిసాయి. ఈ సభకు దాదాపు 5 లక్షల నుండి 6 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉండటంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 'యూత్ ఫర్ నేషన్, ఫైట్ ఫర్ నేషన్' అనే నినాదంతో సాగే ఈ భారీ బహిరంగ సభ....27వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సభలో పార్టీకి సంబంధించిన విధి విధానాలు, లక్ష్యాలు, ఇతర అంశాలపై పవన్ కళ్యాణ్ స్పష్టంగా వివరిస్తారు.

తొలి బహిరంగ సభను విశాఖపట్నంలో నిర్వహించిన తర్వాత... వివిధ అంశాల వారీగా జనంలోకి వెళ్లాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ నిర్ణయించారు. రైతులు, మహిళలు, యువత, కార్మికులు... ఇలా ఆయా వర్గాల వారితో మమేకమై, వారి సమస్యలు తెలుసుకుంటారు. ప్రతీ వారం, పది రోజులకు ఏదో ఒక కార్యక్రమం ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

విశాఖ సభ అనంతరం రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లోని ముఖ్య కేంద్రాల్లోనూ ఇలాంటి సభలే నిర్వహించాలని భావిస్తున్నారు. ఈనెల 27న విశాఖపట్నంలో నిర్వహించే సభకు అభిమానులతోపాటు విద్యార్థులు, యువత నుంచి అనూహ్య స్పందన వస్తున్నట్లు పవన్‌ సన్నిహితులు తెలిపారు.

శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు సభలో పాల్గొంటామని సమాచారం పంపుతున్నట్లు చెప్పారు. ఈసారి పాసులతో పనిలేకుండా, అందర్నీ సభకు అనుమతించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యువతను ఆకట్టుకునేందుకు 'యూత్‌ ఆఫ్‌ ది నేషన్‌-ఫైట్‌ ఫర్‌ ది నేషన్‌' అని సభకు ట్యాగ్‌లైన్‌ పెట్టారు. ఇందు కోసమే రూపొందించిన ప్రత్యేక లోగో, గీతాన్ని సోమ, మంగళవారాల్లో ఆవిష్కరించనున్నారు.

తన స్నేహితుడు రాజు రవితేజతో కలిసి పవన్‌ రచించిన 'ఇజం' పుస్తకాన్ని విశాఖ సభలో ఆవిష్కరిస్తారు. కాగా, సోమవారం వివిధ ప్రాంతాల్లో మోటారు సైకిళ్లతో ర్యాలీలు నిర్వహించాలని పవన్‌ అభిమానులు నిర్ణయించారు. సభలో ఆవిష్కరించేందుకు భారీ జాతీయ పతాకాన్ని ఓ అభిమాని రూపొందిస్తున్నారు. పీవీపీ సంస్థ ప్రతినిధులు ఈ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

English summary

 Narayana said Pawan Kalyan is new to politics and he needs some enlightenment. The CPI secretary cautioned Pawan Kalyan not to be confused between the “beards” of Che Guvera and that of BJP Prime Ministerial candidate Narendra Modi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu